– పంచాయత్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదం
– 42 శాతం రిజర్వేషన్ అమలుకు అవకాశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31: సుదీర్ఘ చర్చల అనంతరం మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు త్వరలో కార్యరూపం దాల్చనుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఎట్టకేలకు అసెంబ్లీ అమోదం తెలిపింది. పంచాయతీల్లో రిజర్వేషన్‌పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన సవరణ బిల్లును మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంతోబీవఓఱ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో ఆమోదం పొందాయి. ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లుకు కూడా శాసనసభ ఏకగ్రీవ ఆమోదం లభించింది.
పక్కాగా బీసీలకే అమలు: మంత్రి పొన్నం
బిల్లు ఆమోదానికి ముందు పలువురు మంత్రులు మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని
బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 42 శాతాన్ని పక్కాగా బీసీలకే అమలు చేస్తామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు 42 శాతం రిజర్వేషన్లు తీసుకుని బలపడాలని కోరారు. బీసీలు అంచెలంచెలుగా ఎదగాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు తెలుపుతూ కేంద్రంలో ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని బీజీపీని నిలదీశారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





