వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్(కిట్స్ డబ్ల్యు)లో మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఫైనార్ట్స్ (ఎండిుఫ్) క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్), సహస్ర ఉమెన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో, మొత్తం దేశంలో పువ్వుల శక్తివంతమైన రంగులు, ప్రకృతి, ఐక్యత స్త్రీత్వం బలం గురించి వివరించారు. ఈ పండుగ పర్యావరణ అనుకూలమైనది, ప్రకృతి రంగుల పండుగ (పువ్వులు) అని చెప్పారు. కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో విద్యార్థులు పూలతో అలంకరించిన బతుకమ్మలను తీసుకువచ్చారు. కార్యక్రమంలో డీన్ విద్యార్థి వ్యవహారాల ప్రొఫెసర్ ఎం.శ్రీలత, సహస్ర మహిళా సెల్ చైర్‌పర్సన్ డాక్టర్ కె.సౌజన్య కన్వీనర్ వి.గౌతమి, ఫ్యాకల్టీ ఇన్‌చార్జిలు డాక్టర్ పిఎస్‌ఎస్ మూర్తి, డాక్టర్ సిహెచ్.శ్రీదేవి, డాక్టర్ గ్రేస్ శాంతి (లిటరరీ క్లబ్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి), విద్యార్థి ప్రతినిధులు, ఎండిఎఫ్ క్లబ్ తరపున ఎన్.సంహిత (అధ్యక్షురాలు), శ్రీలాస్య, పిఎంసి విద్యార్థి ప్రతినిధులు సాయిసుమంత్ (అధ్యక్షుడు), సాయి సాత్విక్, సాయి చరణ్, అధ్యాపకులు, సిబ్బంది, 500 మందికిపైగా విద్యార్ధినులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



