– శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీసాంప్రదాయలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని అన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆటపాటలతో అందరూ వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను సీఎం ప్రార్థించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





