హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: జూబ్లీహిల్స్ మధురా నగర్‌లోని చైల్డ్ రైట్స్ కమిషన్ కార్యాలయం, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో బతుకమ్మ వేడుకలలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. వారితో కలిసి బతుకమ్మ ఆడారు. మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో చైల్డ్స్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ సీతాదయాకర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజ, కమిషన్ సభ్యులు అపర్ణ, చందన, వందన గౌడ్, సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్ కుమార్, సెక్రటరీ మోతి, ఉద్యోగులు, శిశు విహార్ బాలలు పాల్గొన్నారు. అలాగే హైటెక్ సిటీలోని శిల్పారామం పక్కన గల ఇందిరా మహిళా శక్తి బజారులో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. డప్పులు, భారీ బతుకమ్మలతో ఆమెకు మహిళలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉమెన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





