– మహిళలకు డిప్యూటీ సీఎం భుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతి, సంప్రదాయాల్లోనే అత్యంత విశిష్టమైనదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ అన్నారు. ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుతూ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా మహిళా సామూహిక శక్తికి, ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ. ఇది.. ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఆడబిడ్డలు, పిల్లాపాపలతో ప్రత్యేక సందడి నెలకొంటుందన్నారు. తెలంగాణ సామూహిక జీవనానికి, ఐకమత్యానికి, సంఘటిత శక్తికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





