– పోస్టర్ విడుదల చేసిన మంత్రులు
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్1: బతుకమ్మ పండుగను అంతర్జాతీయస్థాలిలో గుర్తింపు దక్కేలా, గిన్నిస్ రికార్డు చోటుచేసుకునేలా గొప్ప కార్నివాల్‌గా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బతుకమ్మకు జాతీయస్థాయి ప్రచారం కోసం కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం అని మంత్రి జూపల్లి తెలిపారు. ఈనెల 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సోమవారం మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి ఆయన డియాతో మాట్లాడారు. ఈనెల 21న వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. గిన్నిస్ బుక్ రికార్డస్ సాధించే లక్ష్యంతో ఈనెల 29న ఎల్బీస్టేడియంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తాం అన్నారు పీపుల్స్ ప్లాజాలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తాం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో విద్యార్థులంతా పాల్గొనేలా వేడుకలుంటాయి. బతుకమ్మ వేడుకల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం కల్పిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ పండుగ గురించి, తెలంగాణ సంస్క•తి, సంప్రదాయాల గురించి దేశవిదేశాలకు తెలిసేలా చేస్తామన్నారు. పర్యాటకశాఖ, మహిళలను భాగస్వామ్యం చేస్తూ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. ఈసందర్భంగా పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే పండగ నిర్వహణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





