వెళ్లి రావమ్మా..బతుకమ్మా!

బతుకమ్మ…బతుకమ్మా

మా కంటి వెలుగువు నీవు

మా ఇంటి ఇలవేలుపు నీవు

మా గుండెల సవ్వడి నీవమ్మా

మా బతుకు మెతుకు నీవమ్మా

తెలంగాణ జయహారతి నీకమ్మా

 

పుడమి పూల సింగిడి నీవు

అతివ పూజల సందడి నీవు

పల్లెపట్టణాల సంబురం నీవు

శ్రమజీవన సౌందర్యం నీవమ్మా

సకల జనుల సన్నతి నీకమ్మా

 

 

ఉద్యమాల స్పూర్తివి నీవు

అమరత్వాల కీర్తువు నీవు

త్యాగధనుల చరితవు నీవు

పరాక్రమాల ఘనత వు నీవు

బహుజనుల పబ్బతి నీకమ్మా

 

ఆస్తిత్వ ప్రతీక నీవు

ఆత్మగౌరవ పతాక నీవు

ఊపిరుల ఉద్దీప్తివు నీవు

సంస్కృతుల వేడుక నీవు

జీవన ముఖచిత్రం నీవమ్మా

జాన పదుల ప్రణతి నీకమ్మా

 

కరుణించే తల్లివి నీవు

వరాలిచ్చే కల్పవల్లివి నీవు

సర్వ జగతికి తేజం నీవమ్మా

కోరిన కోరికలను దీర్చుమమ్మా

జగతి శ్రేయస్సుకై మళ్ళీ రావమ్మా

సెలవు..సెలవు సద్దుల బతుకమ్మా

తెలంగాణ జనుల సెలవు నీకమ్మా

“”””””””””

(బతుకమ్మ నిమజ్జనోత్సవం సందర్భంగా….)

కోడిగూటి తిరుపతి

9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *