బాసరలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్స‌వాలు

– వేడుకగా అక్షరాభ్యాసాలు

నిర్మల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. చదువులతల్లి సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా అక్షరాభ్యాసాలు కూడా జోరుగా సాగాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. చిన్నారులకు పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. వేకువజాము నుంచే అమ్మవారి వేదపారాయణం నిర్వహించారు. రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *