– గవర్నర్‌కు బీఆర్‌ఎస్ విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30:ప్రతిపక్షాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అంశంలో సభా సంఘం వేయాలని కోరితే సీఐడీని అడ్డుపెట్టుకుని మంత్రి పొంగులేటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీ నేతలతో కలిసి లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటిపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని.. స్వతంత్ర విచారణకు ఆదేశించాలని కోరినట్లు చెప్పారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరామన్నారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. లోక్ భవన్‌కు వెళ్లిన బీఆర్‌ఎస్ బృందం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. వేల కోట్ల ప్రజా సంపదను మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ ద్వారా కొల్లగొడుతున్నారని బీఆర్‌ఎస్ శాసన సభా పక్ష బృందం ఆరోపించింది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆదివారం కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ వ్యవహారంపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. మంత్రి పొంగులేటి రాఘవ కన్‌స్ట్రక్షన్ ద్వారా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతున్నారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. రాఘవ కన్‌స్ట్రక్షన్్ర మైనింగ్‌పై వ్యవహారాలపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో గత పదేండ్ల కాలంలో జరిగిన ప్రతి అక్రమ మైనింగ్‌పై పూర్తిస్థాయిలో సీబీ సీ-ఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.