దగ్గు మందుపై నిషేధం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: ప్రజలకు తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆల్మంట్‌ కిడ్‌ సిరప్‌ వినియోగాన్ని వెంటనే నిలిపేయాలని ఆదేశించింది. పిల్లలకు అలర్జీ, జ్వరం, ఆస్తమా వంటి సమస్యలకు ఆల్మంట్‌ కిడ్‌ సిరప్‌ను వినియోగిస్తుంటారు. అయితే ఈ సిరప్‌లో విషపూరితమైన ఇథలీన్‌ గ్లైకాల్‌ కలుషితమై ఉన్నట్లు గుర్తించారు. కోల్‌కతాలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నుంచి వచ్చిన రిపోర్ట్‌ ఆధారంగా తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా ఈ సిరప్‌ నియోగిస్తుంటే తక్షణమే నిలిపేయాలని సూచనలు చేసింది. అలాగే సిరప్‌ వినియోగ సమాచారాన్ని సవిూప డ్రగ్‌ కంట్రోల్‌ అధికారికి తెలపాలని సూచించింది. ఈ సిరప్‌ వల్ల కిడ్నీ సమస్యలు, న్యూరాలజికల్‌ డ్యామేజ్‌ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్టేష్రన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పిల్లల సిరప్‌లలో ఇలాంటి కలుషితాలు గుర్తిస్తుడడం వల్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *