- బంగ్లా శరణార్థులకు ఆధార్ కార్డులు సహా సకల సౌకర్యాలు
- నేరాలు చేస్తూ ఇక్కడే వుంటున్న నైజీరియన్లు
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ వెల్లడి
హైదరాబాద్,ప్రజాతంత్ర,మే29: హైదరాబాదులో నేరాలు చేస్తున్న నైజేరియన్లను డిపోర్ట్ చేస్తున్నట్లు- హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డిపోర్టు చేసిన తర్వాత కూడా చాలా మంది నకిలీ పాస్‌పోర్ట్ లతో ఇండియాలోకి ప్రవేశిస్తున్నారని, అలాంటి వాళ్లను కూడా అరెస్ట్ చేస్తున్నట్లు- తెలిపారు. హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను ప్రారంభించిన కార్యక్రమంలో ప్రసంగించారు. నైజీరియన్లను వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేస్తారని భయంతో ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని సంచలన విషయాన్ని తెలిపారు. చివరికి 498 కేసులో అయిన ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టించు కుంటున్నారని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నైజేరియన్ల పై కేసు నమోదు అయితే చట్టపరంగా డిపోర్ట్ చేయలేమని స్పష్టం చేశారు. వారిపై కేసు ట్రయల్ పూర్తి చేసి క్లోజ్ అయ్యే వరకు డిపోర్టు చేయలేమని వివరించారు. బంగ్లాదేశ్ కి చెందిన పౌరులు కూడా శరణార్థులు (Bangladeshi refugees ) గా ఇక్కడికి వస్తున్నారని, ఈ వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అడ్డుదారుల్లో ఇక్కడ ఆధార్ పొందుతున్నారని గుర్తించినట్టు చెప్పారు. ఈ వ్యవహారంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. ఉగ్రవాద లింకులు న్న సర్ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందని సీపీ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఎన్‌ఐఏ నాలుగు చోట్ల సోదాలు చేసిందని.. ఎన్‌ఐఏ విచారణ, సోదాలకు హైదరాబాద్ పోలీసుల సహకారం అడిగితే చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ లో సర్ తో ఇంకా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయనే అంశాన్ని ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటికి వస్తాయని తెలిపారు. అలాగే ఫోన్ టాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని సీవీ ఆనంద్ వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని ప్రస్తుతానికి ఉన్న చర్యలు అన్ని హోల్డింగ్ లోకి వెళ్లిపోతాయన్నారు. కొత్త పాస్‌పోర్టు జారీ పక్రియ మొత్తం కూడా విదేశీ వ్యవహారాల శాఖ చూసుకుంటుందని, పాస్‌పోర్టు ఎప్పుడు ఎలా జారీ చేస్తారనే విషయాన్ని తాము కూడా తెలుసుకోవాలన్నారు. ఇంటర్‌పోల్, డిస్పోర్ట్ ఇతర ఇతర చర్యలు అన్ని కూడా హోల్డింగ్ లోకి పోతాయని వెల్లడించారు.



