– బోరబండకు వస్తున్నా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా
– ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు: కేంద్ర మంత్రి బండి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం బోరబండలో ఆయన మీటింగ్ జరగాల్సి ఉంది. దీనిపై బీజేపీ మండిపడిరది. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి ధర్మారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం బోరబండలోనే మీటింగ్ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. కాగా, బీజేపీ కార్యకర్తలారా, ప్రజలారా.. సాయంత్రం బోరబండకు తరలిరండి.. బీజేపీ దమ్మేందో చూపిద్దాం అని బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. బోరబండలో రోడ్ షోకు అనుమతి కోరలేదంటూ పోలీసులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి సంబంధించిన కాపీని, అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన సర్క్యులర్‌ను మీడియాకు విడుదల చేశారు. పోలీసులూ.. తమాషా చేస్తున్నారా.. రాష్ట్రంలో దారుస్సలాం పాలన నడుస్తోందా? పోలీసులు ఎంఐఎంకు తొత్తులుగా మారారా? బోరబండలో బీజేపీ తడాఖా ఏందో చూపిస్తాం అని సవాల్ విసిరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





