అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకోలేం

– రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారట?
– బీఆర్‌ఎస్ పాలనలో దోపిడీలు, కబ్జాలు తప్ప ప్రజలకు చేసిందేమిటి?
– ఆ పార్టీలను గెలిపిస్తే కేంద్ర నిధులను దారి మళ్లిస్తారు
– కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తోంది బీజేపీయే
– బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే వరదలా నిధులు తెస్తా
– కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పులెత్తుకుపోయే దొంగ.. ఆయనను ఎవరూ నమ్మడం లేదు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇది నామాట కాదు.. ‘నాకు బజార్ల అప్పు పుట్టడం లేదు. నన్ను ఎవరూ నమ్మడం లేదు. దిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారు’ అని రేవంత్ రెడ్డే చెప్పారన్నారు. మరి అలాంటి వ్యక్తికి ఎందుకు ఓట్లేయాలి? అప్పు కూడా పుట్టనప్పుడు నిధులు ఎక్కడినుండి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుర్శేడ్, గోపాల్‌పూర్, సప్తగిరి కాలనీ ఉస్మానీ అసోసియేట్స్ ప్రాంతాల్లో ఆయన శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను 6 గ్యారంటీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ నేతలు వస్తే పదేళ్ల పాలనలో దోచుకుతిన్నారు.. ఎందుకు ఓటేయాలంటూ ప్రశ్నించాలని కోరారు. 4, 5, 44, 45, 13వ డివిజన్ల బీజేపీ అభ్యర్థులు భూపతి రవీందర్, చిందెం హారిక, బండి తార, గడప విజయలక్ష్మీ, రెడ్డవేణ లావణ్యలను గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో బండి సంజయ్ ప్రసంగిస్తూ సీఎంతోపాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలపై ధ్వజమెత్తారు.

కబ్జాలు, దోపిడీలు చేసి జైలుకు పోయారు

బీఆర్‌ఎసోళ్లు పదేళ్లలో చేసిందేమీ లేదు.. కబ్జాలు, దోపిడీలు చేసి జైలుకు పోయారు. ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతుంటే వేద్దామా? మళ్లీ గెలిస్తే నిధులు ఎక్కడి నుండి తీసుకొస్తారు? కేంద్రం నిధులిచ్చినా దారి మళ్లించి దోచుకోకుండా ఉంటారా? ఆలోచించండి అని కోరారు. బండి సంజయ్ ఏం తీసుకొచ్చారు.. మేమే కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చామని మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు. నేనడుగుతున్నా.. మోదీకి కమలాకర్, వినోద్ కుమార్ ముఖం తెలుసా? వాళ్లను గుర్తు పడతారా?.. వాళ్లు అడిగితే మోదీ ఎందుకు పైసలు ఇస్తారు? కరీంనగర్‌కు రూ.1500 కోట్ల నిధులు మోదీ ఇచ్చారు. ఈ మధ్య దిల్లీ పోయినప్పుడు ‘బండి.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించమను. మరిన్ని నిధులు ఇస్తా. అభివృద్ధి చేస్తా అని మోదీ తనతో చెప్పార#Bandi Sanjay #corner meetings #Dన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం అప్పగిస్తే వరదలా నిధులను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపిస్తే ఇంటి పన్నులు, నల్లా చార్జీలు, కరెంట్ చార్జీల పెంపు ఖాయం అన్నారు. అదే బీజేపీకి ఓట్లేస్తే మున్సిపాలిటీల్లో ఏ ఒక్క పన్ను పెంచకుండా కేంద్రం నుండే నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు. మొన్ననే కేంద్రం కరీంనగర్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు ఇచ్చింది. ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం నుండి రూ.134 కోట్లు తీసుకొచ్చిన అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *