హిందువులు వోటు బ్యాంకుగా మారాలి

– న‌న్ను మ‌త‌త‌త్వ వాది అన్నా బాధ‌ లేదు
– జూబ్లీహిల్స్ లో అన్నీ మురికివాడ‌లే
– హైడ్రా కూల్చిన‌వ‌న్నీ  హిందువుల ఇళ్లే
– అధికారంలోకి వ‌స్తే ఫాతిమా కాలేజీ కూల్చేస్తాం
– కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8:   మ‌త‌త‌త్వ‌వాది అని బోర్డు ఇస్తే మెడ‌లో వేసుకొని తిర‌గ‌డానికి అభ్యంత‌రం లేదు. 80శాతం హిందువులు వోటుబ్యాంకుగా మారి మీ స‌త్తా ఏంటో చూపాల‌ని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక్క‌డ కేవ‌లం హిందూ వ‌ర్సెస్ ముస్లింల మ‌ధ్యే పోటీ వుంద‌న్నారు.  ఒక్కో వోటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ వారు సిద్ధమైనారు. ముస్లింలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు, మిక్సర్లు, గ్రైండర్లు ఇస్తున్నారని ఆరోపించారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా శ‌నివారం షేక్ పేట శివాజీ విగ్రహం వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయ‌న మాట్లాడుతూ గోపీనాథ్ ఆస్తులపై సీఎం, కేటీఆర్ ఇద్ద‌రూ క‌న్నేశార‌ని, గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. అందుకే దీనిపై విచార‌ణ చేయ‌డంలేద‌న్నారు. జూబ్లిహిల్స్ లో ఉన్నవన్నీ బస్తీలు, మురికవాడలే న‌న్నారు. ముడుతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకునే తిరిగే కేటీఆర్ కు వేల కోట్లు ఎట్లా వచ్చాయ‌ని ప్ర‌శ్నించారు.  కేసీఆర్ పాలనలో వేల మంది రైతులు చనిపోయిన సంగతి మర్చిపోదామా?  పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రాక కూలీ పని చేసుకున్న విషయం మర్చిపోదామా? కాంగ్రెస్ కు అవకాశమిస్తే హైడ్రా పేరుతో పేదల ఇండ్లపై బుల్డోజర్లు పంపుతోంద‌న్నారు. హైడ్రా పేరుతో కూల్చిన ఇండ్లన్నీ హిందువులవేన‌న్నారు. చెరువును కబ్జా చేసిన ఫాతిమా కాలేజీ కడితే మాత్రం దాని జోలికి పోరన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా కాలేజీ భవనాన్ని కూల్చేస్తామ‌న్నారు. అక్కడ పేదలకు ఇండ్లు కట్టి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులిస్తుంటే,  కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంద‌న్నారు. మోదీ తెలంగాణకు సాయం చేస్తుంటే కనీసం ఫోటో కూడా పెట్టడం లేదు. సీఎం రేవంత్ కు మాత్రం ముస్లిం వోట్లు మాత్రమే కావాలట.  సీఎంకు అటు పక్క, ఇటు పక్క ముస్లింలు మాత్రం టోపీ పెట్టరు. రేవంత్ మాత్రం టోపీ పెట్టుకుని మోసం చేస్తడు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇండ్ల మధ్య ఖబరాస్తన్లు చేస్తడ‌ని ఆరోపించారు. కేసీఆర్ కూడా సొంత పైసలతో ముస్లింలకే ఖబరస్తాన్ కట్టిస్తడట.  హిందువులను పట్టించుకోడు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చిన నీచులు కాంగ్రెసోళ్లన్నారు. బీజేపీని గెలిపిస్తే అయోధ్య నుండి పూజారులను పిలిపించి పెద్దమ్మ గుడిని కట్టిస్తాన‌న్నారు. అమిత్ షాను పిలిపించి పూజలు చేయిస్తా. గోదావరిఖనిలో 46 మైసమ్మ గుడులను కూల్చేశారు. 48 గంటల్లో ఆ గుడులను పునర్నిర్మించకపోతే వాళ్ల సంగతి చూస్తా. జూబ్లిహిల్స్ పోలింగ్ తరువాత నేనే గోదావరిఖని వెళతా. మసీదులను కూల్చివేయిస్తాన‌న్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అట. ముస్లిం అంటే కాంగ్రెస్సేనని సీఎం చెబుతున్నడు. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను చంపుతానన్న ఒవైసీని సీఎం సంకనేసుకుని తిరుగుతున్నడన్నారు. హిందువులు ఒక్కసారి నినదిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుపోవాలన్నారు. లక్ష వోట్ల కోసం కాంగ్రెసోళ్లు మసీదులు, దర్గాల చుట్టూ బిచ్చగాళ్లలా తిరుగుతున్నార‌న్నారు. కాంగ్రెసోళ్లు ఏనాడైనా మీ ఇండ్లకు వచ్చి మీ సమస్యలు అడిగి తెలుసుకున్నారా? హిందువుల వోట్లే అక్కర్లేదనుకున్నప్పుడు…మీరెందుకు వోటేయాలి? అని ప్ర‌శ్నించారు. మాగంటి గోపీనాథ్ మరణం ఓ మిస్టరీ. గోపీనాథ్ హాస్పిటల్ లో  ఉంటే ఆయన తల్లిని కూడా చూడనీయకుండా వేధించారు. గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు రెండు ఆధార్ కార్డులున్నాయి. ఇవిగో రెండు ఆధార్ కార్డులు. గోపీనాథ్ మరణంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పడం సిగ్గు చేటు. నెల రోజుల క్రితమే గోపీనాథ్ కొడుకు తారక్ సైబరాబాద్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు.  ఇదిగో కంప్లయింట్ కాపీ పంపిస్తున్నా. గోపీనాథ్ మరణంపై విచారణ చేయాలి. గోపీనాథ్ ఆస్తుల కోసం దొంగ నాటకాలు ఆడుతున్న మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చారని ఆరోపించారు. గోపీనాథ్ భార్యకు, కొడుకు తారక్ కు న్యాయం చేయాల‌న్నారు. 6 గ్యారంటీలకు తూట్లు పొడిచారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి బస్ చార్జీలు పెంచేశార‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *