– కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 :మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసిన కిరీంనగర్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ చెంప చెళ్లుమనిపించారన్నారు. సీఎం స్థాయి వ్యక్తులు కరీంనగర్ కార్పొరేషన్ లో కుట్రలు చేశారని, సభ్యులకు బ్లాంక్ చెక్కులు, కార్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలు, బీఆర్ఎస్ పెద్దలు ఈ కుట్రలో భాగమయ్యారని ధ్వజమెత్తారు. కరీంనగర్ కార్పొరేషన్ కు చెందిన 10 డివిజన్ కార్పొరేటర్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్లేట్ చీఫ్ రామచంద్రరావు, బండి సంజయ్ ల సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, అఖిలపక్షం మీటింగ్ లేకుండా, ప్రజాప్రతినిధుల అభిప్రాయం లేకుండా జీహెచ్ఎంసీని ఏకపక్షంగా విభజించడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీని మూడు ముక్కలు ఎందుకు చేశారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



