సిరిసిల్ల వరద బాధితులకు రూ.10 లక్షల సాయం

– కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రకటన

కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు పిలుపు మేరకు తన ఎంపీ లాడ్స్‌ నిధులను వరద బాధితులకు కేటాయింలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ నిర్ణయించారు. అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాల ప్రజలను ఆదుకోవాలంటూ రామచందర్‌రావు ఎంపీలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్పందించిన బండి సంజయ్‌ ఆకాల వర్షాలతో నష్టపోయిన సిరిసిల్ల జిల్లా ప్రజలను ఆదుకునేందుకు తన ఎంపీ ల్యాడ్స్‌ నిధులనుంచి రూ.10 లక్షలను అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు త్వరలోనే అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆకాల వర్షాలతో సిరిసిల్ల జిల్లాలో భారీ ఎత్తున నష్టం సంభవించిందన్నారు. రైతులకు పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించిందని, పలువురు నిరాశ్రయులయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ లాడ్స్‌ నిధులతో వరద బాధితులను ఆదుకునేందుకు కృషిచేస్తానని సంజయ్‌ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *