– మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్,ప్రజాతంత్ర,సెప్టెంబర్3: కాళేశ్వరం అవినీతిపై ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్ రిపోర్టులు వచ్చాక కూడా కాలయాపన చేశారని, ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేస్తే ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి దృష్టి మరల్చేందుకే కవిత అంశం ముందుకు వచ్చిందన్నారు. కాళేశ్వరం, గొర్రెలు, బర్రెల కుంభకోణంపై చర్చ జరగాలన్నారు. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ వేయాలని తొలుత డిమాండ్ చేసింది తామేనని మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. తమ డిమాండ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల కాలయాపన చేశారని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్‌లో జిల్లా పోలింగ్ బూత్ అధ్యక్షుల, కార్యదర్శుల సమ్మేళనంలో మాట్లాడుతూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణ ఎలా చేస్తుందంటూ సందేహం వ్యక్తం చేశారు. కమిషన్ రిపోర్ట్ బీఆర్‌ఎస్ చేతిలో పెట్టి.. సీబీఐతో విచారణా అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బిడ్డ కవిత చెప్పిందని ఈ సందర్భంగా బండి గుర్తు చేశారు. కేసీఆర్ బిడ్డ రాజీనామా చేస్తే ఏమవుతుందంటూ సందేహం వ్యక్తం చేశారు. కవితను సస్పెండ్ చేస్తే ఎం? చేయకపోతే ఎం? అంటూ అభిప్రాయపడ్డారు. పార్టీ అంతర్గత వ్యవహారాన్ని కావాలనే బయటకు తెచ్చారన్నారు. కవిత ఎపిసోడ్‌తో తెలంగాణకు ఏమైనా లాభం ఉందా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



