మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్

– మంత్రి వివేక్‌ ‌కాన్వాయ్‌పై దాడి కేసు

– క్యాతనపల్లిలో కొనసాగిన బంద్‌
-‌ బిఆర్‌ఎస్‌ ఆం‌దోళనతో తీవ్ర ఉద్రిక్తత

మంచిర్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. మంత్రి వివేక్‌ ‌కాన్వాయ్‌పై దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దఎత్తున సుమన్‌ ఇం‌ట్లోకి వెళ్లిన పోలీసులు అరెస్ట్‌కు సహకరించాలని కోరారు. ఇందుకు మాజీ ఆయన ససేమిరా అనడంతో బలవంతంగా అరెస్ట్ ‌చేసి పోలీస్‌ ‌వ్యాన్‌లో తరలించారు. సుమన్‌ను అరెస్ట్ ‌చేసేందుకు వచ్చిన పోలీసులను బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తల ఆందోళనల మధ్యే సుమన్‌ను అరెస్ట్ ‌చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను హాస్పిటల్‌కి తరలించారు. దీంతో క్యాతనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా మంగళవారం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి కాన్వాయ్‌పై బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు రాళ్లు రువ్వారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుమన్‌ ‌సహా పలువురు బీఆర్‌ఎస్‌ ‌నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన నివాసం చుట్టూ వందలాదిమంది బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు చేరుకుని అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. చివరకు బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు సుమన్‌ను అరెస్ట్ ‌చేశారు.‌

కొనసాగుతోన్న బంద్‌ : సుమన్‌ ఇం‌టి వద్ద పోలీసుల హంగామా

క్యాతనపల్లి మున్సిపల్‌ ‌కౌన్సిల్‌లో ఆడబిడ్డలపై కాంగ్రెస్‌ ‌దౌర్జన్యం చేయడాన్ని ఖండిస్తూ బీఆర్‌ఎస్‌, ‌సీపీఐ ఆధ్వర్యంలో బంద్‌ ‌కొనసాగుతోంది. మున్సిపాలిటీలోని వ్యాపారులు, వివిధ సంఘాలు, ప్రజలు ప్రజా తీర్పుకు మద్దతు తెలిపి బంద్‌లో పాల్గొన్నారు. బంద్‌ ‌సందర్భంగా మున్సిపాలిటీలో భారీగా పోలీసులు మోహరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యను హౌస్‌ అరెస్టు చేశారు. ఇక నిన్న మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా పోలీసు సిబ్బందిపై దాడి చేశారని బాల్క సుమన్‌పై కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో బాల్క సుమన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటి ముందు చేరుకున్నారు. ఈ విషయం తెలిసి భారీగా బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. దీంతో బాల్క సుమన్‌ ఇం‌టి ముందు ఉద్రిక్తత నెలకొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *