సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే..

– కేసీఆర్‌పై ప్ర‌తీకార చ‌ర్య‌లు త‌గ‌వు

– ఎమ్మెల్యే బండారి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుల ధర్నా

ఉప్పల్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు పేరుతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చే ప్రతీకార చర్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగుతున్నారని పేర్కొంటూ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి ఉప్పల్‌ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు చేసే ఇలాంటి నీచ రాజకీయ నాటకాలకు ముగింపు పలికి, పాలన మీద దృష్టి పెట్టాలని సూచించారు. ప్రాణాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టును అపవాదులకు గురిచేయకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ స్వాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలపై బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *