స్వామి వారి సేవలో మండలి డిప్యూటీ చైర్మన్ 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ డీఈఓ భాస్కరాచార్యులు స్వామివారి చిత్రపటం లడ్డు ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు పల్లెపాటి బాలయ్య తదితరులు పాల్గొన్నారు..

స్వామివారి సేవలో ప్రముఖులు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జూలై 14:యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారులు హర్కార వేణుగోపాల రావు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ డీఈఓ భాస్కరాచార్యులు స్వామివారి చిత్రపటం లడ్డు ప్రసాదం అందజేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *