– రీల్స్ తదితర కార్యకలాపాల నిషేధం
న్యూదిల్లీ,సెప్టెంబర్ 12(ఆర్‌ఎన్‌ఎ): సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫొటోలు, రీల్స్ చేయడం, వీడియోలు తీయడంపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబరు 10న జారీచేసిన ప్రకటనలో డియా సిబ్బంది ఇంటర్వ్యూలు, వార్తలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను కేవలం భద్రతా ప్రమాణాలకు అనుగుణమైన జోన్‌లో మాత్రమే నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు ప్రాంగణంలో అధికారిక వినియోగానికి మినహా, వీడియోగ్రఫీ, రీల్స్ చేయడానికి, ఫొటోలు తీయడం కోసం ఉపయోగించే ఫోన్స్, కెమెరా, టైపాడ్, సెల్ఫీ స్టిక్ వంటి పరికరాలను న్యాయస్థానం నిషేధించింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై బార్ అసోసియేషన్ లేదా రాష్ట్ర బార్ కౌన్సిల్ తగిన చర్యలు తీసుకోవాలి. డియా సిబ్బంది, నిబంధనలను అతిక్రమిస్తే ఆ డియాకి నెల పాటు ప్రాంగణంలోకి అడుగు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వవచ్చు. కోర్టు సిబ్బంది లేదా రిజిస్ట్రీ, సంబంధిత ఉన్నత అధికారులు ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తూ.. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం అని సర్క్యులర్‌లో పేర్కొంది. హై సెక్యూరిటీ జోన్‌లో సిబ్బంది, న్యాయవాదులు లేదా ఇతరులు ఫొటోలు లేదా వీడియోలు తీయకుండా నిరోధించే హక్కు భద్రతా సిబ్బందికి ఉంటుందని జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





