బాలు విగ్రహాన్ని అడ్డుకోవడం దారుణం

– రోశయ్య, బాలసుబ్రమణ్యం ఒకప్రాంతం వారు కాదు
– బిఆర్‌ఎస్‌ ‌సెంటిమెంట్‌ ‌రాజకీయాలు ఆపాలి
– రోశయ్య వర్ధంతి సభలో పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌గౌడ్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 3: ‌తెలంగాణ సెంటిమెంట్‌తో భారత రాష్ట్ర సమితి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌  అన్నారు.  మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదనిమహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. నగరంలోని రవీంద్ర భారతిలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభలో మహేష్‌ ‌గౌడ్‌ ‌పాల్గొని ప్రసంగించారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సెంటిమెంట్‌ ‌రగల్చి బీఆర్‌ఎస్‌ ‌లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేవుళ్ల విషయంలో సీఎం ఒక సామెతగా చెప్పారని.. దాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. బీఆర్‌ఎస్‌ ‌కోసమే కిషన్‌ ‌రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. హిల్ట్ ‌పాలసీ ద్వారా హైదరాబాద్‌లో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులో వొస్తాయని మహేష్‌ ‌గౌడ్‌ ‌వెల్లడించారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ ‌మారుతుందని తెలిపారు. అవినీతికి అలవాటు పడ్డ కేసీఆర్‌ ‌కుటుంబం.. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏం చేసినా అవినీతి అని ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ ‌విమర్శించారు. కాగా, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభను రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌, ‌మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ దయానంద్‌, ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత వీహెచ్‌, ‌జగ్గారెడ్డి, వైశ్య కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌కాల్వ సుజాత, టూరిజం కార్పొరేషన్‌ ‌మాజీ చైర్మన్‌ ఉప్పల్‌ శ్రీ‌నివాస్‌ ‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. రోశయ్య వర్ధంతి సందర్భంగా వి.హనుమంతరావును రోశయ్య మెమోరియల్‌ ‌ట్రస్ట్ ‌సత్కరించింది. అలాగే రోశయ్య మెమోరియల్‌ ‌ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పేద విద్యార్థులకు మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌, ‌మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌స్కాలర్‌షిప్‌లు అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *