కఠిన షరతులతో ఐబొమ్మ రవికి బెయిల్‌

– ఇం‌టర్నెట్‌ ‌వాడడానికి నిషేధం
– కోర్టుకు పాస్‌ ‌పోర్టు సరెండర్‌
‌- విదేశాలకు వెళ్లడానికి వీల్లేదు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 17: టాలీవుడ్‌తో పాటు ఇతర చిత్ర పరిశ్రమలను వణికించిన పైరసీ వెబ్‌సైట్‌ ’ఐబొమ్మ’ వ్యవస్థాపకుడు రవికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ ‌మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్‌ ‌సాధారణంగా కాకుండా అత్యంత కఠినమైన నిబంధనలతో కూడి ఉండటం గమనార్హం. గత కొంతకాలంగా సాగుతున్న విచారణ అనంతరం, ఆయనకు ఉపశమనం కలిగిస్తూ బెయిల్‌ ‌మంజూరు చేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కోర్టు పలు ఆంక్షలు విధించింది.ప్రధానంగా రవి ఇంటర్నెట్‌ ‌వినియోగంపై కోర్టు పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించింది. ఆయన ఎలాంటి ఇంటర్నెట్‌ ‌సౌకర్యాన్ని సొంతంగా వాడకూడదని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సి వస్తే కేవలం పోలీసుల ముందస్తు అనుమతితో మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. దీనితో పాటు నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి చేస్తూ, ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. భద్రతా చర్యల్లో భాగంగా రవి తన పాస్‌పోర్ట్‌ను వెంటనే కోర్టులో డిపాజిట్‌ ‌చేయాలని న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే వాటిని తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌చేస్తూ చిత్ర పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టాన్ని చేకూర్చారనే ఆరోపణలపై రవి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున, ఆయన మళ్లీ వెబ్‌సైట్‌ ‌నిర్వహణ లేదా పైరసీ పనులు చేపట్టకుండా ఉండేందుకే కోర్టు ఇంటర్నెట్‌పై ఇటువంటి అరుదైన , కఠినమైన ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *