చెన్నూర్, మార్చి 2 : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు చెన్నూర్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ రవి మంగళవారం బెయిల్ మంజూరు చేశారు. చెన్నూర్ నియోజ కవర్గం క్యాతనపెల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా గత నెల 16న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణల కాన్వాయ్ పై రాళ్ళ దాడికి పాల్పడినట్లు సుమన్, మూల రాజిరెడ్డిలతో పాటు మరో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జిల్లా జైలుకు పంపారు. 13 రోజుల అనంతరం మంచిర్యాల జిల్లా కోర్టులో సుమన్ కు బెయిల్ మంజూరు అయింది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరనే ఆరోపణ కేసులో బెయిల్ మంజూరు చేయడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ సుమన్ బెయిల్ కోసం ప్రయత్నం చేసిన స్థానిక సీనియర్ న్యాయవాది మల్లేశం గౌడ్ ను కోర్టు వద్దే ఎత్తుకొని సుమన్ జై అంటూ నినాదాలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




