– ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సు లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 14న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) కార్యదర్శి బడుగు సైదులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంజెపీ ద్వారా నిర్వహిస్తున్న ఈ కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రాజేంద్రనగర్‌లోని ప్రోఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ(పీజేటీఏయూ) ఆడిటోరియంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని పేర్కొన్నారు. అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలు తీసుకుని రావాలని, మరిన్ని వివరాల కోసం https://www.pjtau.edu.in, https://mjptbcwreis.telangana.gov.in/ వెబ్‌సైట్ సందర్శించాలని ఆయన సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



