కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు

– శంషాబాద్‌ విమనాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన
– ఏపీ మంత్రి పార్థసారథి చొరవతో అయ్యప్పలకు ప్రత్యేక విమానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ఇండిగో సంస్థ విమానాల రాకపోకలను నిలిపేయడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 92 విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ వెల్లడిరచింది. ఇందులో శంషాబాద్‌కు రావాల్సినవి 43, ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి 49 ఉన్నాయి. ముందుగా బుక్‌ చేసుకున్న సర్వీసుల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విశాఖ నుంచి 8 ఇండిగో సర్వీసులు రద్దు చేశారు. వీటిలో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌కు వెళ్లాల్సినవి ఉన్నాయి. ఇండిగో విమానం గురువారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉంది. ఇందులో వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు సాయంత్రమే విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విమానం శుక్రవారం ఉదయానికి కూడా(12 గంటలపాటు ఆలస్యం) బయలుదేరకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. బోర్డింగ్‌ గేటుకు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 12 గంటలుగా తాము విమానాశ్రయంలోనే ఉన్నామని, విమానం గురించి తమకు సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆసహనం వ్యక్తం చేశారు. అయ్యప్ప భక్తులు ప్రయాణించే విమానం ఆలస్యంపై ఏపీ మంత్రి పార్థసారథి అడిగి తెలుసుకుని కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో మాట్లాడి శబరిమలకు విమాన సర్వీసు ఏర్పాటు చేయించారు. విజయవాడకు వెళ్లాల్సిన విమానం మిస్‌ కావడంతో ఆయన రోడ్డు మార్గంలో బయలుదేరారు. తమ కోసం శ్రమపడి ప్రయాణ సదుపాయం కల్పించిన ఆయనకు అయ్యప్ప భక్తులు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఇండిగో విమానాల రద్దు పరంపర కొనసాగుతున్నది. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలతో వరుసగా మూడో రోజూ శుక్రవారం 500కుపైగా విమానాలను రద్దు చేసింది. దీంతో ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమ విమానానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *