భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షి అయోధ్య

– రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేటితో పూర్ణాహుతి
– ధర్మ ధ్వజం భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం
– ధ్వజారోహణతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయి
– అయోధ్య రామాలయ ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ

అయోధ్య, నవంబర్‌ 25: ‌భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షిగా అయోధ్య నిలిచిందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అయోధ్య రామాలయం శిఖరంపై జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. జై శ్రీరామ్‌ ‌నినాదంతో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందన్నారు. రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరిగిందని చెప్పారు. ధర్మ ధ్వజం కేవలం జెండా కాదని, భారత సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమని ప్రధాని మోదీ అభివర్ణించారు. సంకల్పం, సఫలతకు ఈ ధ్వజం చిహ్నమని పేర్కొన్నారు. ధర్మ ధ్వజం శ్రీరాముడి సిద్దాంతాలను ప్రపంచానికి చాటుతుందన్నారు. ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణ ఇస్తుందని స్పష్టం చేశారు. కర్మ, కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మ ధ్వజం వివరిస్తుందన్నారు. పేదలు, దుఃఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నామని మోదీ తెలిపారు. ఈ ధ్వజారోహణ కార్య‌క్ర‌మంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయన్నారు. ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగారో అయోధ్య చెబుతుందని పేర్కొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో ధ్వజారోహణ  కార్యక్రమంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు. కోట్లాదిమంది కల సాకారమైంది. 500 ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారమైంది. ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నా. రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరిగింది. ధర్మధ్వజం కేవలం జెండా కాదు.. భారతీయ సంస్క•తి పునర్వికాసానికి చిహ్నం. సంకల్పం, సఫలతకు ఈ ధ్వజం ప్రతీక. శ్రీరాముడి సిద్దాంతాలను ఈ జెండా ప్రపంచానికి చాటుతుంది. స్ఫూర్తి, ప్రేరణను ఇస్తుంది. కర్మ, కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మధ్వజం చెబుతుందని మోదీ పేర్కొన్నారు.  రాముడు కులం చూడడు.. కేవలం భక్తి మాత్రమే చూస్తాడు. ధర్మధ్వజంపై కోవిదార్‌ ‌వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. అయితే మన చుట్టూ కొందరు ఇంకా బానిస భావజాలంతో ఉన్నారు. రాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని వారు అంటున్నారు. అలాంటి బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు చోటు ఇవ్వొద్దు. భారత్‌లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడు. ప్రజాస్వామ్యానికి భారత్‌ ‌పుట్టినిల్లు. ఇది మన డీఎన్‌ఏలోనే ఉంది. శతాబ్దాల క్రితమే భారత్‌లో ప్రజాస్వామ్య విధానం ఉంది. తమిళనాడులోని ఉత్తర మేరూర్‌ ‌శాసనం ప్రజాస్వామ్యం గురించి చెబుతోంది. వచ్చే వెయ్యేళ్లు భారత్‌ ‌తన శక్తిని ప్రపంచానికి చాటాలి. మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుందని మోదీ వ్యాఖ్యానించారు.  కాషాయ జెండా సూర్యవంశానికి చిహ్నమని, ఓం అక్షరం.. కోవింద వృక్షం .. రామరాజ్యానికి సంకేతంగా నిలుస్తుందన్నారు. సంకల్పానికి, సక్సెస్‌కు ఈ జెండా చిహ్నమన్నారు. వందేళ్ల పోరాటానికి, రాబోయే వేల శతాబ్దాలకు ఈ జెండా రాముడి విలువలను చాటుతుందన్నారు. సత్యమే ధర్మం అని ప్రధాని మోదీ అన్నారు. వివక్ష, బాధ ఉండకూడదని, శాంతి.. సంతోషం ఉండాలన్నారు. పేదరికం ఉండకూడదని, ఎవరూ నిస్సహాయంగా ఉండరాదన్నారు. గుడికి రాలేని వారు గుడిపై ఎగురుతున్న జెండాను చూసినా వారికి అంతే పుణ్యం దక్కుతుందని మన గ్రంథాలు చెబుతాయని, చాలా దూరం నుంచి కూడా జెండాను చూసి రామ్‌లల్లా పుట్టిన ప్రదేశం ఇదే అన్న ప్రేరణ పొందవచ్చన్నారు. ఈ సందర్భంలో కోట్లాదిమంది రామ భక్తులకు హృదయ పూర్వక గ్రీటింగ్స్ ‌చెబుతున్నట్లు మోదీ వెల్లడించారు. రామాలయ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికుడు, కళాకారుడు, ప్లానర్‌, ఆర్కిటెక్ట్, ‌వర్కర్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *