– ప్రతి శని, మంగళవారం చార్మినార్ వద్ద శ్రీకారం
– హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: సైబర్ నేరాలను అడ్డుకునేందుకు సరికొత్త కార్యక్రమానికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ శ్రీకారం చుట్టారు. చార్మినార్ వద్ద నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ చరిత్రాత్మక చార్మినార్ వద్ద ప్రతి శని, మంగళవారం గడపగడపకూ సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి (జాగృత్ హైదరాబాద్.. సురక్షిత్ హైదరాబాద్) శ్రీకారం చుట్టామని తెలిపారు. చార్మినార్ వద్ద సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించే ప్రయత్నం చేశామని, అవగాహన లేక చాలామంది సైబర్ నేరాల బారిన పడుతున్నారని తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే ప్రతి రోజూ రూ.కోటి సైబర్ నేరాల్లో పోగొట్టుకుంటున్నారని ఆయన వెల్లడిరచారు. ఓటీపీ ఇన్వెస్ట్‌మెంట్, డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అందరూ అవగాహన, అప్రమత్తత కలిగి ఉండాలని సూచించారు. సైబర్ నేరస్తులు కాల్ చేసి బెదిరిస్తే భయపడవద్దన్నారు. భయపడితే అది సైబర్ నేరస్తుల బలం అవుతుందని చెప్పారు. ప్రైవేట్ ఫోటోలు సోషల్ విూడియాలో అప్‌లోడ్ చేయవద్దని, అలా చేస్తే మిమ్మల్ని ట్రాప్ చేసి మోసం చేసే అవకాశం ఉందని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ సింబా పేరిట వలంటరీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





