మహిళల ఆరోగ్యంపై అవగాహనా సదస్సు

కాళోజి జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 6 : ఆరోగ్య సమస్యలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అపర్ణ అన్నారు. మంగళవారం కేయు పీజీ కళాశాలలో పిసిఒఎస్ సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేయూ డీన్ స్టూడెంట్ అఫైర్స్, సుబేదారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ పీజీ కాలేజ్, యూనివర్సిటీ మహిళా పీజీ కాలేజ్ సంయుక్తంగా పి.సి.ఓ.ఎస్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అపర్ణదుర్గా ముఖ్య వక్తగా ప్రసంగించారు. వయస్సు వచ్చిన బాలికలు తర్వాత ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, పీరియడ్స్ సమయంలో కలిగే ఇబ్బందులపై అవగాహన కల్పించారు. డాక్టర్ అపర్ణ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంతో ముఖ్యమన్నారు. జంక్ ఫుడ్‌ను తగ్గించడం, సరైన నిద్ర పోవడం, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడం ద్వారా పి.సి.ఓ.ఎస్ సమస్యలను నియంత్రించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమానికి కేయూ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ బైరి నిరంజన్ అధ్యక్షత వహించగా, ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, సుబేదారి పి.జి.కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నరసింహ చారి, యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సౌజన్య, కేయూ యూత్ ఆఫీసర్ డాక్టర్ రాధిక హాజరయ్యారు. డాక్టర్ రమాదేవి, డాక్టర్ భాగ్యమ్మ, డాక్టర్ సరిత, రజితతోపాటు పీజీ కాలేజ్ విద్యార్థినులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *