- క్యాన్సర్ వృద్ధికి ఎక్స్‌ట్రా సెల్లులార్ వెసికిల్స్ పాత్ర కీలకం
- అంకాలజీ ప్రొఫెసర్ గీతా కె. వేముగంటి
కాళోజి జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర : మానవ శరీరంలో క్యాన్సర్ (Cancer) పురోగతికి కారణమైన చిన్న ఎక్స్‌ట్రా సెల్లులార్ వెసికిల్స్ పాత్ర కీలకంగా పనిచేస్తుందని హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల అంకాలజీ ప్రొఫెసర్ గీతా కె. వేముగంటి (Dr.Geeta K Vemuganti ) అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్‌లో రెండో రోజు సైన్స్ కాంగ్రెస్ ఉత్సాహంగా కొనసాగాయి మహిళా శాస్త్రవేత్తలు వివిధ అంశాలపై తమ ఉపన్యాసాలను ఇచ్చారు. ప్రొఫెసర్ గీత. కే.వేముగంటి మాట్లాడుతూ “కేన్సర్ పురోగతిలో చిన్న ఎక్స్‌ట్రాసెల్యులర్ వెసికుల్స్ పాత్ర” పై వివరించారు. చిన్న ఎక్స్‌ట్రాసెల్యులర్ వెసికుల్స్ ట్యూమర్ కణాల (Cancer Cells) మధ్య సమాచార మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇది కేన్సర్ వేగంగా పెరగడానికి దోహదపడుతుందన్నారు. ఈ వెసికుల్స్ ఇమ్యూన్ సిస్టమ్‌ను తప్పించుకునే విధంగా పని చేసి, కేన్సర్ సెల్స్ రక్షణ పొందేలా చేస్తాయన్నారు. వీటి పై ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలన్నారు.
హైదరాబాద్ ఐఐసిటి ప్రొఫెసర్ డాక్టర్ సుంకర వర్దిరెడ్డి మనోరమ మాట్లాడుతూ ఓ వ్యక్తి లేదా సమూహం తాత్కాలికంగా ప్రారంభించిన జీవన ప్రయాణం, అది క్రమంగా వారి జీవిత విధానంగా మారిన విశేష కథనాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ ప్రయాణం వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక సేవ, సాంస్కృతిక మార్పులవైపు దారి తీసిన మార్గాన్ని వివరించగలదన్నారు. హైదరాబాద్ డిఆర్డిఓ శాస్త్రవేత్త టి.వెంకట మణి మాట్లాడుతూ.. ఎంబెడెడ్ వ్యవస్థలలో వస్తున్న ఆధునిక పోకడలను వివరించారు. అదేవిధంగా యంగ్ సైంటిస్ట్ ల తో జరిగిన మీట్ లో యంగ్ సైంటిస్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డాక్టర్ రామచంద్ర రావు ఎల్లా మాట్లాడుతూ క్వాంటం డాట్స్ పై, సౌర పటలాలపై, వైద్య రంగంలో క్వాంటం కంప్యూటింగ్ పై విద్యార్థుల తో ముఖాముఖి నిర్వహించారు.
అదే విధంగా హైదరాబాద్ ఎన్.జి.ఆర్.ఐ శాస్త్ర వేత్త హర్షిత్ రెడ్డి గంగుల అరుదైన భూ మూలకాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఇచ్చారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ సైంటిస్ట్ బి డాక్టర్ ఫణికాంత్ జోగం ప్రోటీన్ మార్పిడి పై విద్యార్థుల సందేహాలు నివృత్తి చేశారు. భౌతిక శాస్త్ర విభాగం లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు ఆచార్య ఎస్.శ్రీనాథ్ అయస్కాంత పదార్ధాలు రోజువారీ వినియోగం, ఉపయోగాలు వివరించారు. ఫార్మసీ కళాశాలలో సెమినార్ కు చైర్మన్ గా ఆచార్య జానపు రెడ్డి కృష్ణవేణి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసీ ఆచార్య సిద్ధివిరేశం హాజరయ్యారు. సదస్సు కు ములుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ డాక్టర్ వి. చంద్రశేఖర్ మాట్లాడుతూ జీవన ప్రమాణాలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 1950 లో 46 నుంచి 70 సంవత్సరాలకు వరకు పెరిగిందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ లో వచ్చిన అభివృద్ధి వల్ల అంట వ్యాధులను వివిధ పద్ధతుల ద్వారా అరికట్టడం సాధ్యమైందన్నారు. ప్రస్తుతం అసంక్రమిక దీర్ఘకాలిక వ్యాధులు షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, వివిధ క్యాన్సర్లు వృద్ధాప్యంలో ఎక్కువైనాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ఆయుర్దాయం నాణ్యత లోపించి సగటు మనిషికి సమాజానికి ఆర్థిక భారాన్ని పెంచుతున్నదన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు లేనటువంటి జీవన ప్రమాణాలను పెంచుకోవలన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలినీ అలవరచుకోవాలన్నారు. ఆహార శైలి, వ్యాయామము, కండరాలను బలోపేతంగా ఉంచుకోవడం, బయోటెక్నాలజీ శాస్త్రీయ రీసెర్చ్ డెవలప్మెంట్, మైటోకాండ్రియా హెల్త్, స్టెమ్ సెల్ థెరపీ అవసరమన్నారు. నిషిత్ గుప్త ఆచార్య బిట్స్ ఫిలాని బయలాజికల్ సైన్స్ ప్రాముఖ్యతను క్లుప్తంగా వివరించారు. సెక్రటరీస్ సీనియర్ ప్రొఫెసర్ వై నరసింహారెడ్డి, ఆచార్య సమ్మయ్య డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ ఆచార్య జనపరెడ్డి కృష్ణవేణి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.





