-కల్వర్టుల, కాజ్‌వేల వద్ద అప్రమత్తం
– ఆర్ అండ్ బి అధికారులకు సూచన
– అధికారులతో సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. అధిక వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనల వివరాలపై ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో శనివారం మంత్రి సమీక్షించారు. వరద ప్రవాహాలకు రాష్ట్ర వ్యాప్తంగా 454 చోట్ల ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 629 కిలో టర్లు రోడ్డు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చినట్లు- చెప్పారు. రోడ్ల మరమ్మత్తులపై పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం వేసిన నాణ్యతా రహిత రోడ్ల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రోడ్ల డ్యామేజీపై అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..భారీ వర్షాల కారణంగా 22 చోట్ల రోడ్లు తెగిపోతే వెంటనే 4 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేసినట్లు- మంత్రి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. 171 చోట్లలో ఇంకా కాజ్ వే, కల్వర్టులు వద్ద వరద ప్రవాహం ఉన్నట్లు పేర్కొన్నారు. 108 రాకపోకలకు ఇబ్బంది ఉన్న ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. 71 చోట్ల క్లియర్ చేయగా.. మిగతా చోట్ల సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. వాగుల వెంట 58 కి. రోడ్డు కోతకు గురైందని, అందులో 378 టర్లు రోడ్డును ప్రభుత్వం మూసివేసిందని తెలిపారు. మొత్తంగా 147 చోట్లలో కాజ్ వే, మైనర్ బ్రిడ్జిలు, కల్వర్టులు తాత్కాలికంగా, శాశ్వతంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని మంత్రి సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు కల్వర్టులు, లో లెవెల్ వంతెనలు, కాజ్ వేల వద్ద ఇంజినీర్లు విధిగా తరచూ క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. ప్రాణనష్టం జరగకుండా ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలన్నారు. అందుకు పోలీస్, విద్యుత్, రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీ రాజ్ శాఖల విభాగాలతో ఆర్ అండ్ బీ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రజా రవాణాకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టులు వద్ద తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని, క్షేత్ర స్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.





