జాజులు నవ్విన రాత్రి

జాజులు నవ్విన ఏ జావళీల జానపదుల్లో నిన్ను వెతుక్కొంటూ వేణుగానమై రవళిస్తుంటాను పవళించే నీ ఊహల రాత్రుల్లో వెండి వెన్నెల రంగుల కలల్ని నెమరేస్తూ నెమ్మదిగా నన్ను నేను మైమరచిపోతాను జాగురూకతో జాబిలి రాత్రుల్ని నీకై అన్వేషణ సాగిస్తాను మంద్రంగా మీటే మిణుగురు రాగాల్ని వింటూ నీ కోసం సాహిత్య చకోరినై ఏ గగన తీరాన్నో…









