prajatantra_news

prajatantra_news

పాలమూరు సమస్యలు పట్టని రేవంత్‌

– మహబూబ్‌నగర్‌లో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 26: మహబూబ్‌నగర్‌ జిల్లా అంటేనే వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది.. అయితే ఈ రోజు తన పర్యటనలో వర్షంతో భగవంతుడు ఆశీర్వదించడం ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్‌…

పాలనలో ఏఐ ఉపయోగించాలి

– తెలంగాణ మొదటి రాష్ట్రంగా ఎదగాలి – అందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి – ఎంసీహెచ్‌ఆర్‌డీ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI)ను పరిపాలనలో పూర్తిస్థాయిలో ఉపయోగించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని, అందుకు తగిన విధంగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి గ్రామస్థాయి అధికారి…

లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు డీఎస్పీలు మృతి

చౌటుప్పల్‌, ప్రజాతంత్ర, జులై 26: లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతిచెందారు. యాదాద్రి భువనగిరి పరిధి చౌటుప్పల్‌ మండలం కౌతాపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీలు చక్రధర్‌రావు(57), శాంతారావు(54), అడిషనల్‌ ఎస్పీ కోకా రాంప్రసాద్‌ తదితరులు విధి నిర్వహణలో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న…

వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుందాం

– మహబూబ్‌నగర్‌ పర్యటనలో రామచందర్‌రావు మహబూబ్‌నగర్‌, జులై 26: మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావుకు బాలానగర్‌లో కార్యకర్తలు స్వాగతం పలికి సన్మానించారు. మార్గంమధ్యలో తిమ్మాపూర్‌ పాలమాకులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అంతకుముందు కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్‌ మండలంలో బీజేవైఎం ఆధ్వర్యంలో…

28, 29లలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ బహిరంగ విచారణ

– హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: తెలంగాణకు చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ప్రత్యేక బహిరంగ విచారణను(ఓపెన్‌ హియరింగ్‌ అండ్‌ క్యాంప్‌ సెట్టింగ్‌) చేపట్టనున్నది. న్యాయాన్ని వేగంగా అందించేందుకు రాష్ట్ర అధికారులు, ఫిర్యాదుదారుల సమక్షంలో ఈనెల…

అమర సైనికుల వీరత్వాన్ని మరువలేం

–  షాపూర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద కార్గిల్‌ విజయ్‌ దివస్‌ 5కే రన్‌ – మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హౖాెదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి తమ పరాక్రమంతో కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ పాకిస్తాన్‌పై విజయం సాధించడంలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తున్నానని బీజేపీ రాష్ట్ర…

ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు ఇలంబర్తి, రంగారెడ్డికి డి.దివ్య, ఆదిలాబాద్‌్‌కు సి.హరికిరణ్‌లను నియమించింది. అలాగే నల్గొండకు అనితా రామచంద్రన్‌, నిజామాబాద్‌కు ఆర్‌.హనుమంతు, మహబూబ్‌నగర్‌కు రవి, కరీంనగర్‌కు సర్ఫరాజ్‌ అహ్మద్‌, వరంగల్‌కు కె.శశాంక, మెదక్‌కు ఎ.శరత్‌, ఖమ్మంజిల్లాకు కె.సురేంద్రమోహన్‌లను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు…

హెచ్‌సీఏ స్కామ్‌లో దేవరాజ్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) కుంభకోణంలో ఆ సంస్ధ జనరల్‌ సెక్రటరీ దేవరాజ్‌ను సీఐడీ శుక్రవారం అరెస్టు చేసింది. ఈ ఏడాది సమ్మర్‌ క్యాంపులు నిర్వహించినట్లు లెక్కలు చూపించి ఈ సంస్థ రూ.4 కోట్లు స్వాహా చేసిన విషయాన్ని సీఐడీ గుర్తించింది. దేవరాజ్‌ను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను సీఐడీ…

పీఆర్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఊరట

– సర్వీసు మరో ఏడాది పొడిగిస్తూ జీవో హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ పద్దతిలో పనిచేస్తున్న 12,055 ఉద్యోగులకు భారీ ఊరట కలిగింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు వారి సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వారి సేవలను…

వంద మీటర్ల పరిధిలో 50 లారీల చెత్త

– బుల్కాపూర్‌ నాలాలో పేరుకుపోయిన చెత్త – క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: నాలాల్లో వరద సాఫీగా సాగేలా చూడాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ప్రజలకు సూచించారు. నాలాల్లో ఎక్కడైనా ఆటంకాలుంటే వెంటనే తొలగించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశిస్తూ వరద నీరు సాఫీగా సాగితే అనేక ప్రాంతాలకు…