prajatantra_news

prajatantra_news

రెండు ఫిర్యాదులపై టీజీ హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

– తీవ్ర స్వభావమున్న ఆరోపణలు – విచారణకు హాజరు కావాలి – అధికారులకు, ఫిర్యాదుదారులకు సమన్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన రెండు వేర్వేరు ఫిర్యాదులను చైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌(టీజీ హెచ్‌ఆర్‌సీ) పరిశీలించింది. సంబంధిత అధికారుల నుండి సమాధానం, విచారణ…

తెలంగాణ ‘టెట్‌’ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 13: ‌తెలంగాణలో టెట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదలయింది. ఈనెల‌ 15‌వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు స్వీకరణకు తుది గడువు 29‌వ తేదీతో ముగియనుంది. జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ  గురువారం నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది.…

పరువు నష్టం కేసు ఉపసహరించుకున్న నాగార్జున

– మంత్రి కొండా సురేఖ క్షమాపణలతో.. హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 13: ‌మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసును ప్రముఖ సినీ హీరో నాగార్జున వెనక్కి తీసుకున్నారు. తమ కుటుంబంపై సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వేసిన పరువు నష్టం దావా కేసును ఉపసంహరించుకున్నట్లు నాగార్జున వెల్లడించారు. గతంలో నాగచైతన్య- సమంత…

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఉదారత

– టెన్ల్‌ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించేందుకు నిర్ణయం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: విద్యార్థుల చదువు, వారికి కనీస సదుపాయాలు కల్పించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మరోసారి విద్యార్థుల పట్ల తన ఉదారతను చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న వారిపై ఫైనల్‌ పరీక్ష…

పేలుడు ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య

– చికిత్స పొందుతూ మరొకరు మృతి న్యూదిల్లీ, నవంబర్‌ 13: ‌దేశ రాజధాని దిల్లీలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. లోక్‌నాయక్‌ ‌జయప్రకాష్‌ ‌నారాయణ్‌ ‌హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది. సోమవారం సాయంత్రం దిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట సపంలో…

ఉగ్ర కుట్రకు కేరాఫ్‌ అల్‌ ‌ఫలాహ్‌ ‌వర్సిటీ

– విధ్వంస రచనకు రూమ్‌ ‌నంబర్‌ 17 – ఇక్కడి నుంచే ముష్కరుల పథక రచన న్యూదిల్లీ, నవంబర్‌ 13: ‌దిల్లీ బాంబు పేలుడుఘటన నేపథ్యంలో అల్‌ ‌ఫలాహ్‌ ‌వర్సిటీ  పేరు తెరపైకి వొచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది.…

ఎ‌ర్రకోట ఘటన వెనక నిప్పులాంటి నిజాలు

– 32 కార్లతో వరుస పేలుళ్ల కోసం రెడీ అయిన ముష్కరులు – డిసెంబర్‌ 6‌న దాడులకు పాల్పడాలన్న భారీ స్కెచ్‌ -‌ దర్యాప్తులో వెల్లడవుతున్న కుట్ర  కోణాలు న్యూదిల్లీ, నవంబర్‌ 13:‌దేశ రాజధాని దిల్లీ నగరంలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్నాయి. ఈ పేలుడు…

ఐదు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ ‌సోదాలు

– అల్‌ఖైదాతో సంబంధం ఉన్న బంగ్లాదేశీయుల గుర్తింపు న్యూదిల్లీ,నవంబర్‌13: ‌జాతీయ దర్యాప్తు సంస్థ  గురువారం ఐదు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. అల్‌ ‌ఖైదా గుజరాత్‌ ఉ‌గ్రవాద కుట్రలో అక్రమ బంగ్లాదేశ్‌ ‌వలసదారుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఐదు రాష్ట్రా దాదాపు పది చోట్ల ఎన్‌ఐఏ ‌తనిఖీలు నిర్వహించింది. పశ్చిమ బెంగాల్‌, ‌త్రిపుర, మేఘాలయ, హర్యానా, గుజరాత్‌లలో…

రేపు ‘జూబ్లీ’ ఉప ఎన్నిక ఫలితాలు

– సర్వత్రా ఉత్కంఠ – కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ల మ‌ధ్యే పోటీ – బీజేపీ పోటీ నామామాత్రమేనా ? (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)  హోరాహోరీగా జరిగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోరాటంలో తుది విజయం ఎవరిదన్నది శుక్ర‌వారం తేలనుంది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటనుండే అదృష్టం ఎవరిని వరించనుందన్నది వెల్లడికానుంది. ఈ ఎన్నికల్లో 58…

రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత

– సిర్పూర్‌లో అత్యంత కనిష్ఠంగా 7.1 డిగ్రీలు – అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: రాష్ట్రంలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. గురువారం ఉదయం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో అత్యంత కనిష్ఠంగా 7.1 డిగ్రీలుగా నమోదుకాగా తిర్యాణిలో…