prajatantra_news

prajatantra_news

జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో గెలిచిన కాంగ్రెస్‌

– అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది – బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీత ఆరోపణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 14: ‌జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో ఉప ఎన్నిక జరిగిందని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది అని అభివర్ణించారు.  ఉప ఎన్నికలో  కాంగ్రెస్‌ ‌అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ‌గెలుపొందిన‌ నేపథ్యంలో సునీత…

బీహార్‌లో అభివృద్ధికే పట్టం కట్టారు

– తెలంగాణలో డబ్బులు పంచి గెలిచారు – రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మరింత విస్తరిస్తుంది I బీహార్‌, జూబ్లీహిల్స్‌ ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: బీహార్‌లో ఎన్డీయే ప్రభంజనం కనబడుతోందని, ఎన్డీయే ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధికి ప్రజలు పట్టం గట్టారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి…

వొచ్చే ఎన్నికల్లో వందసీట్లు సాధిస్తాం

-జూబ్లీహిల్స్ ‌విజయంపై పీసీసీ చీఫ్‌ ‌నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌14: ‌వొచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 100 ‌సీట్లు గెలుస్తుందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ‌పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌గెలవడంతో నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నేరవేరుస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్…

ఉ‌గ్రవాదులకు గట్టి హెచ్చరిక

-దిల్లీ బాంబర్‌ ఉమర్‌ ఇల్లు పేల్చివేత శ్రీనగర్‌,‌నవంబర్‌14: ‌దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడుకు కారణమైన ముష్కరుడు డాక్టర్‌ ఉమర్‌ ‌నబీ ఇంటిని భద్రతా బలగాలు పేల్చి వేశాయి. దేశద్రోహానికి పాల్పడ్డ ఈ దుండగుడి ఇంటిని పేల్చేయడం ద్వారా గట్టి సమాధానం ఇవ్వాలని, గట్టి సందేశం ఇవ్వాలని నిర్ణయించారు. దిల్లీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా…

జూబ్లీలో గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది

– మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి – పార్టీ గెలుపు కోసం కృషి చేసిన అందరికీ అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ భారీ మెజారిటీతో విజయం…

ఫలించిన సీఎం రేవంత్‌ ‌వ్యూహం

– జూబ్లీహిల్స్ ‌గెలుపుతో కాంగ్రెస్‌లో ఉత్సాహం – వరుసగా రెండు సీట్లు గెలుచుకున్న ఘనత – కంటోన్మెంట్‌, ‌జూబ్లీహిల్స్‌తో నగరంలో ఖాతా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 14:‌ జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ‌గెలుపు దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ర‌చించిన‌ వ్యూహం ఫలించింది.  ఈ ఎన్నికకు సంబంధించి చివరి…

నియోజకవర్గ ప్రజల వెన్నంటే ఉంటా

– విజయం అందించినందుకు నవీన్‌ ‌కృతజ్ఞతలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 14: ‌నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయనని జూబ్లీహిల్స్ ‌నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ ‌స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం నవీన్‌ ‌యాదవ్‌ ‌శుక్రవారం యూసుఫ్‌గూడలో విలేకర్లతో మాట్లాడుతూ.. అధిక బ్జడెట్‌ ‌తీసుకువచ్చి.. జూబ్లీహిల్స్‌ను మరింత అభివృద్ధి…

నవీన్‌ విజయం.. ధ్రువీకరణ పత్రం అందజేత‌

– ప్రశాంతంగా ముగిసిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నగరంలోని కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌…

పెట్టుబడులకు తెలంగాణ అనువైనది

– ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు బృందంతో సీఎస్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 14 : రాష్ట్రం పెట్టుబడులకు అనువైనదని, దేశంలోనే ఫాస్ట్‌ గ్రోయింగ్‌ స్టేట్‌గా ఉన్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, మూసీ నది సుందరీకరణ, యంగ్‌ ఇండియా స్కిల్‌,…

వ్యక్తి మానసిక వికాసానికి గ్రంథాయాలు కీలకం

– కిట్స్‌ వరంగల్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కోమల్‌రెడ్డి – కళాశాలలో గ్రంథాలయాల వారోత్సవాలు ప్రారంభం వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: సమాజ అభివృద్ధికి, వ్యక్తి మానసిక వికాసానికి గ్రంథాలయాలు కీలకమైనవని కిట్స్‌ కళాశాల రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.కోమల్‌ రెడ్డి పేర్కొన్నారు. పుస్తకాలే జ్ఞానానికి ఆధారం అని విద్యార్థులు రోజూ గ్రంథాలయాన్ని వినియోగించుకుని తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని…