prajatantra_news

prajatantra_news

కారు ఢీ : వైద్య విద్యార్థిని దుర్మణం

– హయత్‌నగర్‌ ‌పీఎస్‌ ‌పరిధిలో సంఘ‌ట‌న‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ‌నగరంలోని హయత్‌నగర్‌ ‌పీఎస్‌ ‌పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఎంబీబీఎస్‌ ‌విద్యార్థిని ఐశ్వర్య మృతిచెందారు. ఆర్టీసీ కాలనీ వద్ద తన తండ్రి పాండుతో కలిసి రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. తీవ్రవ్రంగా గాయ‌ప‌డిన‌ యాంసాని ఐశ్వర్య, పాండులను…

స్టీల్‌ ‌ఫ్యాక్టరీలో పేలుడు : ఒకరి మృతి

మెదక్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15:‌ మెదక్‌ ‌జిల్లా మనోహరాబాద్‌ ‌మండలం చెట్లగౌరారంలోని ఎంఎస్‌ ‌స్టీల్‌ ‌పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి…

కామారెడ్డి జిల్లాలో దారుణం

-గెలిచిన సర్పంచ్‌ ‌తమ్ముడి దాష్టీకం -ఓడిన అభ్య‌ర్థిని ట్రాక్ట‌ర్‌తో ఢీ కొట్టిన వైనం -పలువురికి తీవ్ర గాయాలు.. హాస్పిటల్‌కి తరలింపు కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ‌రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగియ‌డంతో కక్షలు కార్పణ్యాలు బయటపడుతున్నాయి.  గెలుస్తామన్న ధీమాతో బరిలోకి దిగిన అనేకమంది ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. సర్పంచ్‌ ఎన్నికల కోసం భారీగా డబ్బులు…

జీహెచ్‌ఎం‌సీలో డివిజన్ల పెంపుపై సవాల్‌

– హైకోర్టులో రాంనగర్‌ ‌వాసి పిటిషన్‌ ‌- రేపు విచారణ జరపనున్న హైకోర్టు హైదరాబాద్‌,‌డిసెంబర్‌ 15 (ఆర్‌ఎన్‌ఎ): ‌జీహెచ్‌ఎం‌సీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. రాంనగర్‌కు చెందిన వినయ్‌ ‌కుమార్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను…

ముగిసిన మూడో దశ పోలింగ్‌ ‌ప్రచారం

– 17న పోలింగ్‌.. మూడ్రోజులపాటు మద్యం బంద్‌ – ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 15: ‌రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది.సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియగా, బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్‌ 11‌న తొలి విడత, 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి.…

మరింత పతనమైన రూపాయి

– డాలర్ మారకం విలువ రూ.90.80కి క్షీణత – రికార్డు కనిష్ఠానికి చేరిన భారత కరెన్సీ న్యూదిల్లీ, డిసెంబర్ 15: భారత కరెన్సీ రూపా యి మారకం విలువ రోజురోజుకు మరింత పతనమవుతోంది. గతవారం వరుసగా రికార్డు పతనాన్ని చూసిన తర్వాత, సోమవారం రూపాయి విలువ ఇప్పటివరకు ఎన్నడూ లే నంత కనిష్ఠ స్థాయి రూ.…

మార్చి నాటికి టిమ్స్ ప‌నులు పూర్తికావాలి

– ఇంజినీర్ల‌కు స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ ఆదేశాలు – నిర్మాణ ప్రాంతాన్ని ప‌రిశీలించిన ఆర్ అండ్ బి  సీఎస్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15: రాష్ట్ర ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాల‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని,త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కృత నిశ్చయంతో ఉందని స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ అన్నారు.…

తవ్వకాల్లో బయటపడ్డ అమ్మవారి విగ్రహం

– ప్రత్యేక పూజలకు భారీగా తరలి వ‌చ్చిన‌ జనం  మంచిర్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ‌మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడింది. గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా నేలమాలిగ గ్రామానికి వొచ్చిన స్వాజీలు చెప్పిన మాట మేరకు సోమవారం తవ్వకాలు జరపడంతో దుర్గాదేవి విగ్రహం కనిపించింది. ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన ఈ తవ్వకాలను…

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌గూండాగిరి

– సోమార్‌పేట్‌ ‌గ్రామ ఘటనపై కెటిఆర్‌ ఆ‌గ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 15:  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఆ పార్టీ నాయకుల గూండాగిరి రోజురోజుకూ శృతిమించుతోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా…

ఉత్తరాదిన పెరిగిన చలి

– దిల్లీలో పొగమంచుతో విమానాల ఆలస్యం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 15: ఉత్తర భారత దేశాన్ని చలి గడగడలాడిస్తున్న‌ది. రాజధాని దిల్లీని పొగమంచు కప్పేసింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దిల్లీ సహా పంజాబ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌జార్ఖండ్‌, ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌సహా పలు రాష్ట్రాల్లో  ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో విపరీతమైన పొంగ…