prajatantra News

prajatantra News

అనుభవం

మొన్న … బాల్యంలో అమ్మ ఒడిలో పడుకొని చుక్కలు చూస్తూ అనుకుంటారు ఏ అమ్మ ఆకాశంలో చుక్కలు పెట్టి ముగ్గు వేయడం మరిచిందో అని నిన్న … యవ్వనంలో పిల్ల గాలిని ఆస్వాదిస్తూ చుక్కలు చూస్తూ అనుకుంటారు ఈ చుక్కలాంటి అమ్మాయి తన పక్కనుండాలని . నేడు …. వృద్ధాప్యంలో ఒంటరి నిశీధిలో చుక్కలు చూస్తూ…

గ్రూప్ అభ్యర్థుల అక్రమ అరెస్ట్ 

మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం గ్రూప్స్ అభ్యర్థుల అరెస్టు పట్ల  మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విద్యార్థులను వెంటనే విడుదల…

దేశవ్యాప్తంగా 9 మంది వీఐపీలకు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ తొలగింపు

National Security Guards (NSG)

కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు న్యూదిల్లీ,అక్టోబర్‌16: హైరిస్క్‌ జాబితాలో ఉన్న 9 మంది వీఐపీలకు నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎస్‌జీ) కమాండోలను విత్‌ డ్రా చేసుకుని వారి స్థానంలో సీఆర్‌పీఎఫ్‌ కమాండోలకు బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందితో కూడిన తాజా…

అప్పుల వారసత్వానికి ఆద్యులు ఎవరు?

Minister Sitakka counter to Minister KTR allegations

మీ హయాంలో అక్షరాలా రూ.7 లక్షల కోట్ల అప్పులు మంత్రి కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి సీతక్క కౌంటర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,అక్టోబర్‌16: పదేళ్ల పాలనలో లక్షల కోట్ల అప్పులు చేశారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ లాంటి ప్రాజెక్టుల పేరుతో అందినకాడికి అప్పులు తీసుకున్నారు. ఈ లెక్కలన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక బయటపెట్టింది. అసెంబ్లీ సాక్షిగా అన్ని వివరాలను…

గజ్వేల్‌, ‌భువనగిరి, చౌటుప్పల్‌ ‌ప్రాంతంలో కూడా రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు

‌న్యూ దిల్లీ, అక్టోబర్‌ 16: ‌రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు గజ్వేల్‌, ‌భువనగిరి, చౌటుప్పల్‌ ‌ప్రాంతంలో కూడా నలభై కిలోమీటర్ల రేడియస్‌ ‌లో నిర్మాణం చేపట్టాలని, బాధితులకు నష్టపరిహారం పెంచాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ ‌గడ్కారీని కోరినట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌తెలిపారు. బుధవారం న్యూ దిల్లీ లోతెలంగాణ భవన్‌ ‌లో మీడియా సమావేశం లో మాట్లడుతూ తెలంగాణకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లు ఎక్కువ కేటాయించాలని..స్వచ్ఛ భారత్‌ ‌నిధులు పెంచాలని..చెరువులు బాగు చేయడానికి నిధులు ఇవ్వాలని..స్ట్రాటజిక్‌ ‌నాలా డెవలప్మెంట్‌ ‌ప్రోగ్రాం కి నిధులు ఇవ్వాలని కొరినట్లు తెలిపారు.మన ప్రజలు ఇచ్చిన రిప్రజెంటేషన్లను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు కానీ ఒక్క మంత్రి కూడా మాట్లాడటం లేదు ముఖం చాటేస్తున్నారు. ఏదన్నా అంటే ముఖ్యమంత్రిని కలవమంటున్నారు. అది అందరికీ సాధ్యమా ? అని ప్రశ్నించారు. ఇప్పుడున్న ఓఆర్‌ఆర్‌ ‌కి 40 కిలోమీటర్ల దూరంలో రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్తున్నారు. కానీ గజ్వేల్‌, ‌భువనగిరి, చౌటుప్పల్‌ ‌ప్రాంతంలో కేవలం 28 కిలోమీటర్ల లోపే రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డును ఫామ్‌ ‌చేస్తున్నారు. అక్కడ రైతాంగం ఇప్పటికే ప్రాజెక్టుల కోసం, కాలువల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం భూములు కోల్పోయాము, చివరికి అక్కడ వేస్తున్న కరెంటు లైన్ల కోసం కూడా భూములు ఇచ్చి ఉన్న భూమితో బ్రతుకుతున్నాము మమ్ముల్ని బికారీలను చేయవద్దు అని ఉద్యమం చేస్తున్నారు. కోటి రూపాయలు ఉన్న భూమికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం మాత్రమే ఇచ్చారు. మళ్లీ రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు పేరుతో తమను రోడ్డు మీద పదవేయవొద్దని మా దగ్గరికి వొచ్చి రిప్రజెంటేషన్‌ ఇస్తే..నితిన్‌ ‌గడ్గరీని కలిసి వారి బాధను తెలియజేశాను. సంపూర్ణ నివేదిక అందిస్తాము. గడ్గరి మీటింగ్‌ ఏర్పాటు చేసి దీనికి పరిష్కారం చూపిస్తామని తెలియజేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ ‌లాల్‌ని కలిశాము.గతంలో కేంద్రం 2 లక్షల 40 వేల ఇళ్లు ఇస్తే కెసిఆర్‌ ‌ప్రభుత్వం వాటిని కట్టలేకపోయింది. కట్టిన వాటిని కూడా పంచ లేకపోయారు. పంచినవి కూడా స్థానికులకు కాకుండా వేరేవాళ్లకు ఇచ్చారనే అపవాదు ఉంది. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ళు ఈ దఫా ఎక్కువ సంఖ్యలో రాష్ట్రానికి కేటాయించాలని, అది కూడా నిజమైన పేదవారికి దక్కేలా విధివిధానాలు ఉండాలని మంత్రిని కోరాము. తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారని ఈటల పేర్కొన్నారు.

స్వచ్ఛ భారత్‌ ‌నిధులు పెంచాలి కేంద్ర మంత్రులను కోరిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌న్యూ దిల్లీ, అక్టోబర్‌ 16: ‌రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు గజ్వేల్‌, ‌భువనగిరి, చౌటుప్పల్‌ ‌ప్రాంతంలో కూడా నలభై కిలోమీటర్ల రేడియస్‌ ‌లో నిర్మాణం చేపట్టాలని, బాధితులకు  నష్టపరిహారం పెంచాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ ‌గడ్కారీని కోరినట్లు మల్కాజిగిరి…

గంగపుత్రులకు తీవ్రమైన అన్యాయం

ఇదేనా కాంగ్రెస్ మార్కు మార్పు  మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి హరీష్ రావు  హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్16: రేవంత్ రెడ్డి ప్రభుత్వం వొచ్చిన తరువాత, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క చీర కాదు, మేము అధికారంలోకి వొస్తే రెండు చీరలు ఇస్తామని చెప్పారు..బతుకమ్మ రోజు ఒక్క చీర కాదు కదా… ఉన్న చీర కూడా బంద్ పెట్టారు అని మాజీ మంత్రి హరీష్…

కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు

3 percent increase in DA for central employees

రబీ సీజన్‌లో పంటల కనీస మద్దతు ధర పెంపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు న్యూదిల్లీ,అక్టోబర్‌16: మోదీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఒకవైపు కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు కానుకగా ఇస్తూనే మరోవైపు రైతులకు కూడా ప్రభుత్వం భారీ దీపావళి కానుకగా ఇచ్చింది. వాస్తవానికి రబీ సీజన్‌లో…

డి ఫాల్టర్లకు ఈ సీజన్లో ధాన్యం కేటాయించము

 క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  హైదరాబాద్,ప్రజాతంత్రఅక్టోబర్ 16: డి ఫాల్టర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్లో ధాన్యం కేటాయించబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్  సచివాలయంలో ధాన్యం కొనుగోలుపై ఏర్పాటైన సబ్…

దీపావళికి ముందే మిగిలిన వారికి రుణమాఫీ

త్వరలో రైతు భరోసా  రైతులకు అనుకూలంగా ప్రభుత్వం 24 గంటల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తాం అనేక నిర్ణయాలు తీసుకున్నామన్న కోమటిరెడ్డి పంటరుణం రూ.2 లక్షల కన్నా పైనున్న వారికి విడతల వారీగా డబ్బులు జమ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడి నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్‌16:  ‌రైతు సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను…

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్స్‌ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం!

ఒక జిల్లాలో 6వ ర్యాంక్‌ వచ్చిన బీసీ డీ అబ్బాయికి స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘిక శాస్త్రంలో ఉద్యోగం రాలేదు, కానీ 42వ  ర్యాంకు వచ్చిన ఓసి అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అదే జిల్లాలో 61వ ర్యాంకు వచ్చిన ఎస్సీ అమ్మాయికి జాబ్‌ రాలేదు, 452వ ర్యాంకు వచ్చిన  ఓసి అమ్మాయికి జాబ్‌ వచ్చింది. మరొక జిల్లాలో…