ఆయుధం అనివార్యమని తెలుసు…!!

ఆయుధం అనివార్యమైన చోట అస్త్ర సన్యాసం వట్టిమాట రాయపూర్ ఎడతెగని చర్చంతా నీ దోపిడీ కోసమే మమ్మల్ని నిర్మూలించేందుకు నీ కుప్పిగంతులు ఐదుదశాబ్దాల క్రితమే నక్సల్బరీ వసంత మేఘ ఘర్జనకు మా చేతుల్లో ఆయుధాలు చిగురించాయి మా నోళ్ళల్లో ప్రజాకవుల పాటలు పల్లవించాయి కోరన్న మంగన్న వెంపటాపు పంచాది పాణిగ్రాహిల అమరత్వమే మమ్మల్ని సాయుధం చేసింది…








