– తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్‌గుడల్లోని 137 ప్లాట్లకు..
– మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ
– ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం ప్రక్రియ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: నగరంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న 137 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తొర్రూర్, కుర్మల్‌గుడ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బహదూర్‌పల్లి ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చెంది మౌలిక వసతులతో ఉన్న ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు స్వగృహ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతం తెలిపారు. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరల్లోనే చదరపు గజానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అప్‌సెట్ ప్రైస్‌తో ఈ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మంచి కనెక్టివిటీతో వివాదాలు లేని క్లియర్ టైటిల్, ప్రభుత్వ యంత్రాంగమే ఈ లేవుట్లను అభివృద్ది చేయడం, కొనుగోలు చేసిన వెంటనే నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ఉన్న ఈ ప్లాట్లకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్ల కొనుగోలుకు గతంలో పెద్ద ఎత్తున స్పందన రావడంతో మరోసారి ప్లాట్లను విక్రయిస్తున్నామని ఆయన తెలిపారు. నిర్ణీత ధరావతును మీ-సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్/యుపిఐ ద్వారా చెల్లించవచ్చని, డీడీ ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు. ఓఆర్ఆర్-ఆదిభట్ల, ఐటి కారిడార్ సమీపంలోని తొర్రూర్ లే అవుట్‌లోని ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8వ తేదీన, ఓఆర్ఆర్ సమీపంలోని బహదూర్‌పల్లి, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దగ్గరలో ఉన్న కుర్మల్‌గుడ ప్రాంతాల్లోని ప్లాట్లకు ఫిబ్రవరి 8న మధ్యాహ్నం బహిరంగ వేలం నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు ww.swagruha.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు. పోన్ నెంబర్లు 8121022230 (తొర్రూర్), 8347472106 (బహదూర్‌పల్లి), 7993455802 (కుర్మల్‌గుడ)లలో సంప్రదించవచ్చు.
అందుబాటులోని ప్లాట్లు
తొర్రూర్- 105 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. చదరపు గజానికి కనీస ధర (అప్‌సెట్ ప్రైస్) రూ.25 వేలు కాగా ఇవి 200-500 చ.గ విస్తీర్ణంలో ఉన్నాయి. బహదూర్‌పల్లి – 12 ప్లాట్లు. 200-1000 చ.గ విస్తీర్ణంలో ఉన్న ఈ లేవుట్‌లోని కార్నర్ ప్లాట్‌కు చదరపు గజానికి కనీస ధర రూ.30 వేలుగా, ఇతర ప్లాట్లకు రూ.27 వేలుగా నిర్ధారించారు. కుర్మల్‌గుడ – 20 ప్లాట్లు 200-300 చ.గ విస్తీర్ణం. చదరపు గజానికి రూ.20 వేలు కనీస ధరగా నిర్దారించారు.
దరఖాస్తుకు ఆఖరు తేదీలు
తొర్రూర్ ప్రాంతంలోని ప్లాట్ల కొనుగోలుకు రూ.2 లక్షల ధరావతుతో ఫిబ్రవరి 6లోగా, బహదూర్‌పల్లిలోని ప్లాట్లకు రూ.3 లక్షలు, కుర్మల్‌గుడలోని ప్లాట్లకు రూ.2 లక్షల ధరావతుతో ఫిబ్రవరి 7లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



