– ఉద్యమకారుల జేఏసీని అడ్డుకున్న పోలీసులు
– స్వల్ప ఉద్రిక్తత
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సభ్యులు ముట్టడించారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారు ఆందోళనకు దిగారు. పలువురు ఉద్యమకారులు తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను అక్కడికి తరలించారు పోలీసులు. పోలీసుల తీరుపై ఉద్యమకారుల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను బీఆర్ఎ ఎస్ పార్టీ పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదంటూ తెలంగాణ భవన్ వద్ద ఉద్యమకారుల జేఏసీ సభ్యులు ఆందోళన చేశారు. ఉద్యమకారుల ఆందోళనతో తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


