– బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్
గూఢచారుల త్యాగాలను ప్రతిబింబించిన సదురంధర్-2’
దేశాన్ని రక్షించడంలో సరిహద్దుల్లో పోరాడే సైనికులే కాÅ£ గూఢచారులు కూడా ఎంతటి త్యాగాలు చేస్తారో ధురంధర్-2 సినిమా ఎంతో స్పష్టంగా ప్రతిబింబించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి దేశ భద్రత కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటున్న గూఢచారుల నిజ జీవితాన్ని ఈ సినిమా మన కళ్లకు కట్టినట్లు తెలియజేస్తున్నదన్నారు. ఈ సినిమా దేశభక్తి మాత్రమే కాదు, దేశ రక్షణపై బాధ్యతను కూడా పెంపొందిస్తుందన్నారు. ప్రత్యేకంగా, ఈ చిత్రంలో డీమానిటైజేషన్ వెనుక ఉన్న కారణాలను స్పష్టంగా వివరించడమే కాÅ£ అప్పటి నిర్ణయం ఎంత సరైనదో మళ్లీ నిరూపించిందని తెలిపారు. పాకిస్తాన్ నుంచి భారీ స్థాయిలో నకిలీ నోట్లను పంపించి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే కుట్రలను, అలాగే చిన్న పిల్లలను దుర్వినియోగం చేస్తూ దేశంలో అశాంతిని సృష్టించాలనే ప్రయత్నాలను ఈ సినిమా బలంగా ప్రతిబింబించిందన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు జరిగిన ప్రయత్నాలను కూడా ఈ చిత్రం నిజాయతీగా చూపించిందని, అందుకే ఈ చిత్ర బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని రామచందర్‌రావు అన్నారు. ముఖ్యంగా కాలేజీ యువత ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని కోరుకుంటున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





