రజక కుటుంబంపై దాడి అమానుషం

– బాధిత కుటుంబానికి బీజేపీ చీఫ్ రామచందర్ పరామర్శ‌

నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి జాతర సందర్భంగా గణేష్ అనే వ్యక్తి కుటుంబంపై జరిగిన అమానుష దాడి, రెండు నెలల పసిపాప మృతి ఘటన సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో దాడికి గురైన రజక కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించారు. పసికందు ప్రాణాలు కోల్పోయే స్థాయిలో దాడి జరగడం అత్యంత హృదయ విదారకమని, సమాజం మొత్తం సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరగాల్సిన జాతరలో నిర్వాహకుల దురుసు ప్రవర్తన కారణంగా ఈ దారుణం చోటుచేసుకున్నదని ఆరోపించారు. ఈ దాడిలో గణేష్‌కు తీవ్ర గాయాలు కావడంతోపాటు, ఆయన రెండు నెలల పసికందు మృతిచెందడం విచారకరమన్నారు. అధికార పార్టీకి చెందిన వారమనే అహంకారంతో, స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ దౌర్జన్యం సాగిందని ఆరోపించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి బాధితులపైనే అక్రమంగా కేసులు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. బాధితులనే ముద్దాయిలుగా మారిస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ ఘటనలో పోలీసులు, రెవెన్యూ అధికారులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదని, చట్టపరంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం విఫలమైందని అన్నారు. హిందూ ధర్మంలో అన్ని కులాలు ఒక్కటేనని, దేవాలయాలు అందరి కోసం, అన్ని కులాల కోసమేనని స్పష్టం చేశారు. గుడి దగ్గరైనా, బడి దగ్గరైనా కుల వివక్షకు ఎలాంటి స్థానం ఉండకూడదన్నారు. ఎక్కడైనా వివక్ష కనిపిస్తే దాన్ని అంతం చేసే పోరాటంలో బీజేపీ ముందువరుసలో ఉంటుందని స్పష్టం చేశారు. కుమ్మెర బాధిత కుటుంబానికి తక్షణం న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, పూర్తి భద్రత కల్పించాలని కోరారు. తప్పు చేసిన వారు పరారీలో ఉన్నారని, వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను అసెంబ్లీలోనేకాÅ£ అసెంబ్లీ బయట కూడా బీజేపీ ఎమ్మెల్యేలు తప్పకుండా లేవనెత్తుతారని తెలిపారు. ప్రజల కోసమే బీజేపీ¾ పనిచేస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *