– నెతన్యాహు కార్యాలయాన్ని ఢీకొన్న క్షిపణి
– ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్, మార్చి 2: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్పస్ సోమవారంనాడు సంచలన ప్రకటన చేసింది. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని తమ క్షిపణి విజయవంతగా ఢీకొట్టిందని ప్రకటించింది. దాడి జరిగినట్టు చెబుతున్న సమయంలో నెతన్యాహు తమ కార్యాలయంలో ఉన్నారా లేదా అనేది ఇంకా తెలియలేదు. ’క్రిమినల్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, ఎయిర్ ఫోర్స్ కమాండర్ కార్యాలయాన్ని ఖైబర్ షెకాన్ బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా ఢీకొట్టింది’ అని ఆర్‌ఆర్‌జీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇరాన్ ప్రకటనను ఇజ్రాయెల్ ఇంకా ధ్రువీకరించలేదు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మరణించడంతో మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ఇరాన్ ఆదివారం జరిపిన క్షిపణి దాడుల్లో జెరూసలేం సపంలోని బీట్ షెమేష్‌లో 10 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతాయని ఇరాన్ ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ అంతే వేగంగా స్పందించింది. ఇరాన్ ప్రతిదాడులకు దిగితే మునుపెన్నడూ ఎరుగని రీతిలో భయంకరమైన దాడులు చేస్తామని హెచ్చరించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




