బీజేపీ కార్పొరేటర్లపై దాడి విచారకరం

– రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: జీహెచ్‌ఎంసీ స్టాండిరగ్‌ కమిటీ సమావేశంలో తమ పార్టీ కార్పొరేటర్లపై జరిగిన దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్రంగా ఖండిరచారు. ఇది అత్యంత విచారకరం, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కడమేనని అన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి నిధుల వినియోగం, జీహెచ్‌ఎంసీ పనితీరులో పారదర్శకత, జవాబుదారీ గురించి అడిగినందుకే ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడడం అధికార పార్టీ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. తమ డివిజన్లలో ప్రజా సమస్యలు, ప్రాథమిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పలుమార్లు విన్నపాలు ఇచ్చిన బీజేపీ కార్పొరేటర్ల ప్రతిపాదనలను జీహెచ్‌ఎంసీ మేయర్‌, కమిషనర్‌ నెలల తరబడి పట్టించుకోకుండా కాలయాపన చేయడం దారుణమన్నారు. స్టాండిరగ్‌ కమిటీ సమావేశంలో మల్కాజ్‌గిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌, సరూర్‌ నగర్‌ కార్పొరేటర్‌ ఆకుల శ్రీవాణి, యూసుఫ్‌గూడ కార్పొరేటర్‌ మహేందర్‌ తమ ప్రతిపాదనలపై తీసుకున్న చర్యల గురించి న్యాయమైన ప్రశ్నలు అడిగారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి గురించి కార్పొరేటర్లు ప్రశ్నించడం వారి కర్తవ్యం. కానీ మేయర్‌, కమిషనర్‌ సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా, ప్రశ్నలు అడిగిన కార్పొరేటర్లపై పోలీసులతో దాడి చేయించడం అత్యంత దారుణమన్నారు. దీనిపై మేయర్‌, కమిషనర్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని, వినతులపై స్పష్టమైన కాలనిర్ణయంతో చర్యలు తీసుకోవాలని రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. దాడికి బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతినిధులను అణచివేయాలనే అధికార పార్టీ వ్యవహారశైలికి హైదరాబాద్‌ ప్రజలు తగిన బుద్ధిచెప్పక తప్పదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *