– ప్రకటించిన ఇరాన్
– ఖండించిన అమెరికా
టెహ్రాన్, మార్చి 13: అమెరికా విమాన వాహకనౌక అబ్రహాం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ యుద్ధ విమానాన్ని ఢీకొట్టాయని వెల్లడించింది. దాంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని పేర్కొంది. అయితే అమెరికా ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఇరాన్‌పై అమెరికా చేస్తోన్న ’ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి ఈ నౌక మద్దతు ఇస్తూనే ఉందంటూ ఇరాన్ ప్రకటనలను ఖండించింది. ఈమేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ’ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టింది. అమెరికా మీడియా కథనాల ప్రకారం.. అబ్రహం లింకన్‌కు అతిదగ్గరగా ఓ ఇరాన్ పడవ వచ్చింది. దానిని గుర్తించిన అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. అయితే ఈ ఘటనలో యూఎస్ నౌక దెబ్బతిన్నదా, లేదా అని మాత్రం పేర్కొనలేదు. ఇక, ఇరాన్‌తో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ట్రంప్ సేనలు దీనిని దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియాకు తరలించాయి. ఇందులో ఎనిమిది స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉంటాయి. అబ్రహం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. యుద్ధం ప్రారంభమైన మూడు రోజుల తర్వాత నాలుగు క్షిపణులతో దాడి చేశామని చేసిన ప్రకటన కలకలం సృష్టించింది. అయితే ఆ ప్రకటనలో నిజం లేదని అప్పుడు కూడా అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్ వద్ద భారీస్థాయిలో హైపర్‌సోనిక్, నౌకా విధ్వంసక క్షిపణులు ఉన్నప్పటికీ అవి అమెరికన్ విమాన వాహక నౌకను తాకడం దాదాపుగా అసాధ్యమనే చెబుతుంటారు. విమాన వాహక నౌక ప్రధాన బలం దాని ద ఉండే యుద్ధ విమానాలే. యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్‌పై ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్, ఎఫ్-35సి స్టెల్త్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు సహా అనేక విమానాలు ఉన్నాయి. ఇవి శత్రువుపై దాడి చేయడంతోపాటు విమాన వాహకనౌకను రక్షించే సామర్థ్యాన్ని కలిగిఉన్నాయి. పోరు సమయంలో విమాన వాహక నౌక సాగరంలో స్థిరంగా ఉండదు. గంటకు 60 కిలోటర్ల వేగంతో కదులుతుంటుంది. రియల్‌టైమ్ ఉపగ్రహ నెట్‌వర్క్ లేకుండా దీని జాడను ఎప్పటికప్పుడు పసిగట్టడం కష్టం. యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ ప్రస్తుతం అరేబియా సముద్రంలో.. ఇరాన్ తీరానికి దూరంలో వ్యూహాత్మక ప్రదేశంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ సపంలో మోహరించిన అమెరికా విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ‘జెరాల్డ్‌లోని లాండ్రీ ప్రదేశాల్లో ఈ మంటలు చెలరేగాయి. అయితే అందుకు యుద్ధం కారణం కాదు. ఆ మంటలను ఆర్పేశాం. నౌకలోని ప్రొపల్షన్ ప్లాంట్‌కు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. గాయపడిన ఇద్దరు నావికులకు చికిత్స అందుతోంది. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నౌక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఎర్రసముద్రంలో తన సహకారాన్ని కొనసాగిస్తోందని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


