– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24ః అటల్ స్మృతి వర్ష్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్‌లో భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని బీజేపీ శ్రేణులు శుభ్రపరిచి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ద్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు మాట్లాడుతూ దూరదృష్టి గల ఆయన నాయకత్వం, అచంచల జాతీయత, దేశసేవకు అంకితమైన జీవితాన్ని స్మరించుకుందామన్నారు. అటల్ జీ ఆలోచనలు, ఆదర్శాలు ప్రతి భారతీయునికీ స్ఫూర్తిదాయమన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, దీపక్ రెడ్డి, వేముల అశోక్ , రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


