– మంత్రి శ్రీధర్‌బాబుకు ‘ఆటా’ ప్రతినిధుల ఆహ్వానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండాలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 19వ మహాసభలు-యువజన సదస్సు అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో వచ్చే ఏడాది జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్నాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని వారు మంత్రిని ఆహ్వానించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఆటా’ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 19న హైదరాబాద్ టీ-హబ్‌లో నిర్వహించనున్న బిజినెస్ సెమినార్‌కు కూడా ముఖ్య అతిథిగా హాజరు కావాలని శ్రీధర్‌బాబును కోరారు. ఈ సందర్భంగా అమెరికా-తెలంగాణ మధ్య వ్యాపార, సాంకేతిక, స్టార్టప్ రంగాల అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ‘ఆటా’ చేస్తున్న ప్రయత్నాలను వారు వివరించారు. ‘ఆటా’ మహాసభల్లో అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజం, వ్యాపారవేత్తలు, యువ ఇన్నోవేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు. కార్యక్రమాల్లో సాంస్కృతిక వేడుకలు, యూత్ కాన్ఫరెన్స్‌లు, బిజినెస్ కాన్ఫరెన్సులు, ఎన్ఆర్ఐ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రికి వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





