– తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం
– 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: ఈనెల 26 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. 28న అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ రూపకల్పనపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో అన్ని శాఖల మంత్రులు, అధికారులతో శాఖల వారీగా ప్రీ బ్జడెట్ సమావేశాలను పూర్తి చేశారు. ఈసారి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. రైతు సంక్షేమం, మహాలక్క్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించనుంది. పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బ్జడెట్ సమావేశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈసారి సభను 10 నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





