29 నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెం బర్ 22: అసెంబ్లీ సమావేశాలు డిసెం బర్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఎంపీటీసీ, జడ్పీడీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు, పీఏసీ ఎస్ ఎన్నికలు, మున్సిల్-కార్పొరేషన్ఎ న్నికల షెడ్యూల్ తోపాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నట్టు సమాచారం. గత సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఆగస్టు 2025లో పంచాయతీ రాజ్ చట్టాల సవరణలకు శాసనసభ ఆమోదం కూడా తెలిపింది. అయితే రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించడాన్ని రాజ్యాంగ విరుద్ధమం టూ అక్టోబర్లో హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్లు లేకుండా ఎంపీటీసీ, జద్పీడీసీ ఎన్నికలు జరపకూడదని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 50 శాతం పరిమితిని తొలగించాలని ఒత్తిడి తెచ్చేందుకు శాసన సభలో తీర్మానాలు, పార్లమెంటులో ప్రైవేట్ బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు వంటి చర్యలకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *