– బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. రూ.3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బ్జడెట్ ప్రసంగం పూర్తి అయిన అనంతరం స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బ్జడెట్ ప్రసంగం కొనసాగుతుండగానే సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అన్ని వర్గాలను మోసం చేశారంటూ చెవిలో పూలు పెట్టుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బ్జడెట్ ప్రతులను చించివేశారు. బ్జడెట్ మొత్తం మోసం.. మోసం అంటూ సభలో నిరసనలు తెలిపింది. ఆరు గ్యారంటీలకు బ్జడెట్‌లో కేటాయింపులు లేవంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. వారి వాకౌట్‌పై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. మీడియాతో ఆయన చిట్‌చాట్ మాట్లాడుతూ మాట్లాడుతూ బ్జడెట్ ప్రసంగం ముగిసే వరకు ఆర్థికి మంత్రి భట్టి విక్రమార్క నీళ్ళు కూడా తాగలేదన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు పువ్వులు పెట్టుకొని వెళ్లిపోయారని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్ రావు బ్జడెట్ ప్రతులను చించివేయడం బాధాకరమన్నారు. ఈ బ్జడెట్ పేదలు, బీసీ, ఎస్సీ, విద్యార్థులకు ఉపయోగకరమైనదన్నారు. పేదలు, విద్యార్థుల గురించి మాట్లాడే సమయంలోనే వాళ్ళు వెళ్ళిపోయారని నాగేందర్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



